- జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు
సూర్యాపేట : పిఓలు, ఏపీవోలు, ఓపివోలు, రెండో విడత శిక్షణ తరగ తులకు సకా లంలో హాజరుకా వాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో,ఆర్సిఓలు, ఎంఈఓ లు ప్రిన్సిపల్స్ తో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు, జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ అన్ని శాఖలలో ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది సెకండ్ ట్రైనింగ్ క్లాసు కు తప్పక హాజరుకావాలని, హాజరు కాని వారిపై చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు వారి సిబ్బంది పిఓ పిఓ ఓపిఓ లుగా ఉన్న వారందరికీ ఆర్డర్ కాపీ అందజేసి, వివరాలు సాయంత్రానికల్లా తెలపాలని అన్నారు. ఎవరైనా ఆర్డర్ తీసుకో పోయిన వారిపై చర్యలు తీసుకోబడతాయని అన్నారు. జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వారిలో పిడబ్ల్యుడి వారికి బాలింతలకు, చిన్న పిల్లలు గల తల్లులకు ,ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వడం జరిగిందని, ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులన్నీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల విధులో ఉన్న అధికారులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనుటకు పివిసి సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఓ జి. వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు ఎంఈఓ లు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.