Sunday, May 19, 2024

వికారాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో..

తప్పక చదవండి
  • సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరిన మంత్రి కేటీఆర్‌
  • పాల్గొన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు

వికారాబాద్‌ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన భారత రాష్ట్ర సమితి బిఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించి మూడోసారి అధికారం కట్టబెట్టాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ పట్టణంలో, అనంతరం మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి మహేందర్‌ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ.. వికారాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయడం జరిగిందని అన్నారు.

మునుపెన్నడూ సాధించలేని ఇంటర్‌ డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఇంకొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని తనను మీరు గొప్ప మనసుతో ఆదరించి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిపించారని మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడుతున్న ప్రజలకు కరెంటు, మంచినీరు అందించిన ఘనత కేసిఆర్‌ సర్కార్‌ దే అన్నారు. 40 ఏళ్ల స్థానిక ప్రజల కోరిక వికారాబాద్‌ జిల్లా ను, తండాలను పంచాయతీలుగా చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్‌ అందజేస్తున్నామని, కాంగ్రెస్లో కేవలం 29 లక్షల మందికి 200 చొప్పున మాత్రమే పింఛన్‌ అందజేశారని ఏద్ధేవా చేశారు. ఇక మీద తెల్ల రేషన్‌ కార్డు కలిగి భూమిలేని నిరుపేదలకు 5 లక్షల ఉచిత భీమా, సన్న బియ్యం అందిస్తామన్నారు. మైనారిటీల సంక్షేమం కొరకు గడిచిన పదెళ్ళలో 12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ఓడిరచేందుకు అందరూ ఒక్కటి అయ్యారని, ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నాయకుల మాటలు నమ్మి ఆగం కావద్దని అభివృద్ధి సంక్షేమాన్ని కోరే బిఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డిసెంబర్‌ మూడో తారీకు తర్వాత నాలుగు కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని బరోసా ఇచ్చారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తి అయినా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు