Friday, May 17, 2024

రాజశ్యామల యాగం కాదు… జన వశీకరణ క్షుద్ర పూజలు

తప్పక చదవండి
  • సమాజానికి చెడు జరగాలని కోరుకునే వాళ్లకు దైవం తగిన శాస్తి చేయడం తథ్యం
  • కేసీఆర్ పూజలపై బండి సంజయ్ సెటైర్లు
  • అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకే పోటీ చేస్తున్నా
  • పొరపాటున కరీంనగర్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఎగిరేది మజ్లిస్ జెండానే
  • కరీంనగర్ అసెంబ్లీ ఈస్ట్ జోన్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న యాగంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘కేసీఆర్ పైకి మాత్రం రాజశ్యామల యాగం చేస్తున్నట్లు చెబుతున్నడు. లోపల చేసేదంతా ‘‘జన వశీకరణ పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్నడు’’ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు అల్లాడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడంతోపాటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ప్రజలు తనను దీవించి ఎంపీగా గెలిపిస్తే ఏనాడూ ఇంట్లో కూర్చోలేదని, ప్రజల పక్షాన సర్కార్ పై పోరాటాలు చేసి అండగా నిలిచి కరీంనగర్ ప్రజలు తలెత్తుకుని తిరిగేలా చేశానని చెప్పారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే… కరీంనగర్ లోని టవర్ సర్కిల్, కమాన్ చౌరస్తాసహా మున్సిపల్ కార్పొరేషన్ పైనా ఎంఐఎం జెండాలే ఎగురుతాయని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే వచ్చే కరీంనగర్ కార్పొరేషన్ సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంకు 30 సీట్లు కేటాయించడంతోపాటు మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేలా ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ లోని శుభమంగళ గార్డెన్స్ లో జరిగిన పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఈస్ట్ జోన్ పోలింగ్ బూత్ అధ్యక్షుల, కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీలో కమిటీల బాధ్యతలన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులదే. చివరకు బీఆర్ఎస్ మహారాష్ట్ర బాధ్యతలు కూడా కేసీఆర్ అన్న కొడుకుకు అప్పగించాడంటే… ఆ పార్టీ పరిస్థితి ఏందో తెలుసుకోవాలి. తెలంగాణను కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసింది. అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. డబ్బులతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకుంటూ ఎన్నికలైపోంగనే ముఖం చాటేసే వ్యక్తి కేసీఆర్. బీజేపీ సిద్దాంతాలున్న పార్టీ. కార్యకర్తల పార్టీ. ఎంపీగా నేను గెలిచానంటే అది కార్యకర్తల చలువే. మీరు గెలిపిస్తే నేను ఏనాడైనా మీకు తలవంపులు తెచ్చానా? మీరు అండగా ఉండి గెలిపించిన బండి సంజయ్ కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటిచెప్పిన. 70 ఏళ్ల వ్రుద్దులతోపాటు చిన్న పిల్లలు, ఉద్యోగులు, యువకులు, మహిళలు బండి సంజయ్ ను అభిమానిస్తూ సెల్ఫీలు దిగేందుకు ముందుకు వస్తున్నారంటే.. అది కరీంనగర్ ప్రజల భిక్షే. మీరు గెలిపించాక ఏనాడైనా కాషాయ జెండాను పక్కన పెట్టలే. హిందూ ధర్మాన్ని వీడలేదు. పాదయాత్ర చేసి ప్రజలకు అండగా ఉన్నా. నేను హార్ట్ పేషెంట్ ను. గుండె ఆగి చావు అంచులదాకా వెళ్లిన. డాక్టర్లు ఆశలు వదులుకోవాలని చెబితే…. మీరు చూపిన అభిమానమే నన్ను మళ్లీ బతికేలా చేసింది. పాదయాత్ర చేస్తే గుండెకు ఇబ్బంది వచ్చింది. డాక్టర్లు చెక్ చేసి వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి, పాదయాత్ర ఆపాలని చెప్పింది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు న్యాయం జరుగుతోంది. వారి కోసమైనా కేసీఆర్ ను గద్దె దింపుతా. బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పిన. నేను చావుకు భయపడను. నాకే చావు భయపడాలి. ఎన్నాళ్లు బతుకుతానన్నది కాదు.. బతికినన్నాళ్లు నేను ఈ సమాజానికి ఏం చేశానన్నదే నాకు ముఖ్యం. హిందూ ధర్మ పరిరక్షణే నా లక్ష్యం. పేదల రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే నా ధ్యేయం. బీఆర్ఎస్ ను గెలిపిస్తే కమాన్ సర్కిల్, టవర్ సర్కిల్ వద్ద ఎగిరేది ఎంఐఎం జెండానే. చివరకు కరీంనగర్ కార్పొరేషన్ లోనూ ఎగిరేది పచ్చ జెండానే. బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంకు 30 స్థానాలు కేటాయించి గెలిపించడంతోపాటు మేయర్ పదవిని కూడా ఆ పార్టీకే అప్పగించాలని బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం చేసుకుంది. ఇదే జరిగితే… రాబోయే రోజుల్లో ఎంఐఎం అరాచకాలకు అంతుండదు. తట్ట మట్ట తీసే నాథుడు ఉండరు. కరీంనగర్ పాతబస్తీ మాదిరిగా మారి అభివృద్ధికి దూరమవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు