Wednesday, July 24, 2024

కేసీఆర్ తన ఎదుగుదల కోసం భూములు అమ్ముతున్నాడు

తప్పక చదవండి
  • పేదలకు విద్యను దూరం చేసే కుట్రలో బిఆర్ఎస్ ప్రభుత్వం
  • జెఎల్, డిఎల్ అప్లై గడువు పెంచండి..
  • డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రకు చెందిన బిఆర్ఎస్ నేతకు మియాపూర్ ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 111జీవోను ఎత్తివేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూములను బినామీ కంపెనీలకు అప్పజెప్పారని మండిపడ్డారు. రాబోయే బహుజన రాజ్యంలో ఆ భూములన్ని ప్రజలపరం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకే ప్రజలు గమనించి భూ బకాసురులను ఓడించడానికి ఆలోచించి అడుగెయ్యాలని కోరారు. ఉచిత విద్య అందిస్తామని గద్దెనెక్కిన కెసిఆర్ పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మన ఊరు మన బడి నిధులను తప్పుదోవ పట్టించి,అవసరం లేకపోయినా పాత సచివాలయం కూల్చి,1400 కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం కట్టారని పేర్కొన్నారు.ప్రజల పేదల సొమ్మును నీళ్ల లాగ దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి పాలన ఇక మాకు వద్దన్నారు. గురుకుల జెఎల్ ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకోడానికి ఈ రోజు చివరి తేదీ అని,చాలా మంది అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించినా, సాంకేతిక కారణాల వల్ల సైట్ ఓపెన్ కాకపోవడంతో అభ్యర్థులు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. అందుకే గురుకుల జెఎల్ ఉద్యోగానికి అప్లై చేసుకునే గడువు పెంచాలని,ట్రిబ్ చైర్మెన్ మరియు సంక్షేమ శాఖ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బహుజనులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనులను ఈ విధంగా అవమానించడం ఇది మొదటిసారి కాదని గతంలో కెటిఆర్ కూడా బహుజనులను అవమానిస్తూ కామెంట్స్ చేశారని గుర్తుచేశారు.తెలంగాణ బహుజన సమాజం బిఆర్ఎస్ పార్టీని క్షమించదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు