Saturday, April 20, 2024

దుమ్ముదులిపేసిన బలగం

తప్పక చదవండి

బలగం మూవీ త్రిపుల్ ఆర్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఈ చిన్న సినిమా పెద్ద సినిమాని పక్కకు నెట్టేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎగబడ్డారు. ఇందులో భాగంగానే బలగం మూవీకి అద్భుతమైన రికార్డ్ ను కట్టబెట్టారు. బలగం మూవీ ఈమధ్యే టెలివిజన్ లో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను టీవీలో చూడటానికి ఆడియన్స్ ఎగబడ్డారు. దీంతో.. ఈ సినిమా అద్భుతమైన టీఆర్ఫీ ని సాధించింది.

మొదటి టెలికాస్ట్ లో ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 14.2 టీఆర్ఫీ నమోదైంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో రికార్డ్ రేటింగ్స్ వచ్చాయి. హైదరాబాద్ లో దాదాపుగా 22 టీఆర్ఫీని రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ఇక గత ఏడాది టెలికాస్ట్ అయిన RRR చిత్రానికి హైదరాబాద్ సిటీ లో 18 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ ‘బలగం‘ చిత్రానికి అంతకు మించి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇక జబర్దస్త్ కెమెడియన్ వేణు ఏల్దండి తెరకెక్కించిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు