Wednesday, May 15, 2024

ప్రెసిడెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజిట్ వెనకాల ఆసక్తికర విషయం..

తప్పక చదవండి

రాష్ట్రపతి గౌరవ ద్రౌపదీ ముర్ము హైదరాబాదులోని ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ళ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు… అయితే బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నేత నూనె బాలరాజ్ ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు…తన కుటుంబంతో బాటు గౌరవ రాష్ట్రపతిని ఏప్రిల్ 28వ తేదీన కలిశారు. ఆ సమయంలో బాలరాజ్ కూతుర్లు అయిన 9వ తరగతి చదువుతున్న మేధ, నాలుగవ తరగతి చదువుతున్న హయన లను రాష్ట్రపతి పలు విద్యా సంబంధిత విషయాలను అడగగా… తాము ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నామని అక్కడ ఉన్న పలు సౌకర్యాలకు సంబంధించి గౌరవ రాష్ట్రపతికి వివరించారు… అయితే ఈసారి వందేళ్ళ వేడుకలు జరుపుకుంటున్న విషయాన్ని సైతం తెలిపిన ఆ అమ్మాయిలు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారు తమ స్కూల్ కి వస్తే బాగుండని ఆశించారు..

అయితే అక్టోబర్ 10 న పబ్లిక్ స్కూల్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ జే నోరియా తో కలిసి మరోసారి రాష్ట్రపతిని కలిసిన నూనె బాలరాజ్ ఈసారి హైదరాబాదులోని బేగంపేట్ లో గల హైదరబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలకు రావాలని ఆహ్వానించారు.. వారి ఆహ్వానాన్ని మన్నించిన గౌరవ రాష్ట్రపతి ఈసారి విడిది కోసం ఇక్కడికి వచ్చిన సందర్భంలో..నగరంలో జరగనున్న శతాబ్ది వేడుకలకు హాజరుకానుండడంతో తన అమ్మాయిలు గతంలో కోరిన విధంగా స్కూల్ సందర్శన వీలైందని నూనె బాల్ రాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు