Monday, May 6, 2024

జనగామలోనే ఉంటా..జనం సమస్యలను పరిష్కరిస్తా..

తప్పక చదవండి
  • సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు..
  • కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ ను వీడేది లేదు..
  • నియోజవర్గ అభివృద్ధి కోసం పోరాడతా..
  • సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ : నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, పేద ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని వడ్లకొండ గ్రామ శివారులో ఉన్న ఎస్ ఆర్ ఫంక్షన్ హల్ లో మండల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పల్లా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జనగామలో పార్టీ బలంగా ఉందని, నియోజకవర్గంలో బీఆర్ ఎస్ గెలవాలి, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా అద్భుతంగా, ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా పనిచేశారన్నారు. 130గ్రామాలకు గాను 120 గ్రామాల్లో తనకు స్పష్టం మైన మెజారిటీ వచ్చిందన్నారు. ఏ ఒక్క నాయకుడు పైసలు కోసం పనిచేయలేదని, కేసీఆర్ పై ఉన్న నమ్మకంతో పనిచేశారని, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తు న్నానన్నారు. వచ్చే ఐదేళ్లు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, చట్ట పరిధిలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్కుంటానని, ఐదేళ్ల జీతం పేద ప్రజల అవసరాలకు ఉపయోగిస్తానని చెప్పారు. నేను జిల్లాకేంద్రంలో ఇల్లు కట్టుకోవడం తప్ప..ఒక్క సెంట్ భూమి కొననని, ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి పైసా ఖర్చు లేకున్నా వైద్యం అందిస్తానని, ఇప్పటికి నీలిమ హాస్పిటల్ లో రూ.60లక్షల విలువజేసే వైద్యం అందించానని, ప్రస్తుతం 30 మంది చికిత్స తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా న్యాయపరంగా నియోజకవర్గానికి రావాల్సిన నిధులు రావల్సిందేనని, అభివృద్ధి కోసం మంత్రులకు దగ్గరకు వెళ్తానని, కొట్లాడి నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. ఇక గవర్నర్‌ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలతో ఉన్నదన్ననారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల వివరాలను చెప్పకుండా, కేవలం అప్పుల గురించే కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ఆ సాకుతో ఆరు గ్యారెంటీల అమలును అటకెక్కించాలని చూస్తున్నదన్నారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి భాష ఎంత దుర్మార్గంగా ఉందని, ఇంత సంస్కారం లేకుండా, ఆసభ్యకరంగా మాట్లాడే ముఖ్యమంత్రి, మంత్రులు గతంలో ఎవరూ లేరన్నారు. నా మీద కూడా సోషల్ మీడియాలో అస్యతాలు ట్రోల్ చేస్తున్నారని, కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ బాగా సేవ చేస్తారో మీరే అలోచించి చెప్పాలని, మనందరం ఐక్యగా ఉండి పని చేసి, గెలిపించుకుందామన్నారు. ప్రభుత్వం లేదని ఎవరూ భయపడనవసరం లేదని, కాంగ్రెస్ అభ్యర్థి చిల్లరగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, మనం ఓపికతో ఉన్నాం కాబట్టి గెలుపొందామని, రేపు కూడా గ్రామాల్లో కూడా ఎవరితో కొట్టాడొద్దని సూచించారు. తాను జనగామలో నే ఉంటానని, అందరికీ అందుబాటులో ఉంటాననిన, ఎవరూ వచ్చిన అందరినీ కలుస్తానని ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు