Tuesday, October 15, 2024
spot_img

ప్రజల్లో సింపతి వర్కౌట్ అవుతుందా

తప్పక చదవండి
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది
  • కాలు జారి పడటంలో ఆంతర్యం ఏమిటి
  • తుంటి ఎముక విరగడం పలు అనుమానాలకు తావిస్తోంది
  • ఆరోజు రాత్రి ఏమైందన్న అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు
  • నంది నగర్ లోని ఇంటికి రావడానికి గల కారణాలేంటి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు హంగు ఆర్భాటాలు ఏమయ్యాయి. రాష్ట్రాన్ని ఒక చక్రవర్తి మాదిరిగా రాజరిక పాలనకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి నూటికి ఎనభై శాతం ప్రజలు వద్దురా నాయన ఈ దుర్మార్గమైన పాలన అని ప్రజల నోటి నుండే అనిపించుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలువలేకపోయింది. దీంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇవన్నీ ఆయనకు తెలువకుండా జరిగాయా.. ఆయన కుమారుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ మాకు తెలియకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం వల్లనే మేము అధికారాన్ని కోల్పోయామని చెప్పడం, తమను తాము సమర్ధించుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రసంగాలలో మా ప్రభుత్వం వస్తుందని 90 నుండి 105 సీట్లను గెలుస్తామని ఉదరగొట్టారు. మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతూ.. అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం నిజమేనేమో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందేమో అన్నంతగా నమ్మించాలనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు తెలివైన వారు.. ఆయన నమ్మకాన్ని ఆయనకే అప్పజెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని కోరితెచ్చుకున్నారు. అప్పటినుండి ఆయనకు మింగుడు పడడం లేదు. ఎలాగైనా కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసి, బద్నామ్ చేయలేని కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడనడంలో సందేహం లేదు అని అంటున్నారు.

కాలుజారి పడి, తుంటి ఎముక విరగడం.. పలు అనుమానాలకు తావిస్తోంది
కేసీఆర్ కాలు జారిపడి తుంటి ఎముక విరగడం తెలంగాణ ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా జారిపడ్డట్టు వినలేదు. కానీ, అధికారం కోల్పోయిన వెంటనే ఆయన జారి పడడం పట్ల ఏమైనా జరిగిందా, లేక ఆయనపై ఎవరైనా దాడి చేశారా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇంతకీ కాలు జారి పడిన రోజు రాత్రి ఏమైంది.. అర్ధరాత్రి రెండున్నర గంటలకు జారి పడటం ఏంటి.. మన మాజీ ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే ఎలా..? దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇంకో రకంగా చూస్తే ఇదేమైనా రాజకీయ డ్రామాన అనే కోణంలో కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో చేసిన జిమ్మిక్కులు ఇప్పుడు చేస్తే కుదరవంటూ ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

- Advertisement -

నంది నగర్ లో సింపతి వర్కౌట్ అవుతుందా

గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాజమహల్ లాంటి ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లాంటి ఇళ్లల్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు నంది నగర్ లో ఉండడానికి గల కారణాలేంటి.. ప్రజల్లో సింపతి కూడగట్టుకునేందుకు ఇక్కడ ఉంటున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యమయ్యేది. ఆయన అనుకున్న పనిని ఎవరు వద్దన్నా చేసేవాడు. ఒక నిజాం సర్కార్ ని మించి తెలంగాణను పరిపాలిస్తున్నానని అనుకునేవాడు. తన గొప్పలు ఉండాలని అవసరం లేకపోయినా సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కట్టాడు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్న క్యాంప్ ఆఫీసును ప్రగతి భవన్ గా నిర్మించుకున్నాడు. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేశాడు. ఒక కేసీఆర్ తలుసుకుంటే అదెంత ఇదెంత నండి ఎవడో పనికిమాలినోడు చెప్తే నేను ఆపుతామా అంటూ ఆర్భాటాలకు, గొప్పలకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వ్యక్తి , ఇప్పుడు కాలు విరిగింది, చెయ్యి విరిగింది అంటూ సింపతి కోసం ప్రజల ముందుకు వచ్చాడా అని అనుమానాలు కలుగుతున్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించే విధంగా లేరు. ప్రజలకు తాను చేసింది ఏమిటో అర్థమైంది. ఇకనైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించి తన విలువైన సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వం ముందుకు పోయే విధంగా సహకారం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు