Saturday, April 27, 2024

అసలేం జరుగుతుంది?

తప్పక చదవండి
  • నాయకులే సూత్రధారుల నిర్వాసితులకు అన్యాయం
  • నిర్వాసిత ప్రాంతంలో సంబంధం లేనివారికి స్థలం కేటాయింపులు
  • న్యాయం చేయాలంటూ టవర్లు ఎక్కిన బాధితులు

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని నిర్వాసిత ప్రాంతాలైన మాయా బజార్‌ ఎస్‌ఆర్‌టి, వనమానగర్‌ ఏరియాల్లో అసలు ఏం జరుగుతుంది. నిర్వాసితులు ఎవరు, లబ్దిదారులు ఎవరు ఏం అర్థంకాని పరిస్థితి నిర్వాసిత కుటంబాల్లో నెలకొంది. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు పేరేమో నిర్వాసితులది స్థలాలు ఏమో ఇతరు లకు, నిర్వాసితుల లిస్టు తయారు అయితే కానిఅసలు విషయం బయటపడలేదు. సింగ రేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్‌ పరిధిలోని సెవెన్‌షాప్ట్‌ ఓపెన్‌కాస్టు గని ప్రభా విత ప్రాంతాలైన వనమా నగర్‌, మాయా బజార్‌, ఎస్‌ఆర్‌టి ఏరియాలను నిర్వాసిత ప్రాంతాల కింద తొలగించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈచర్యల్లో భాగంగా నిర్వాసితులను గుర్తించి వారికి స్థలాన్ని కేటాయించేందుకు ఆస్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు నిర్వాసితులైన ప్రజలకు భూమి కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈభూ కేటాయింపుల్లో అవినీతి అక్రమాలు జరిగాయని నిర్వాసితులు కాని వారికి భూ కేటాయిం పులు జరిగాయని ఆరోపిస్తూ నిర్వాసితుల కుటుంబాలలోని వ్యక్తులు మాయాబజార్‌తోపాటు రుద్రంపూర్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను ఎక్కి నిరసన తెలిపారు. సోమవార అర ్థరాత్రివరు ఈతతంగం కొనసాగుతూనే ఉంది. అయితే కొంతమంది నాయకుల చర్యల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యిందని ఇష్టానుసారంగా కేటాయింపులు జరిగాయని నిర్వాసితప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. భూకేటాయింపు విషయాల్లో ప్రధానంగా టీఆర్‌ ఎస్‌పార్టీ నాయకుల హస్తం ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈవిషయం ఎటుతేలక అర్థంకాని పరిస్థితిలో ఉంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలుచోటు చేసుకోకుండా పోలీసులు సైతం బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.టవర్‌ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను శాంతియుతంగా దించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆవ్యక్తులు సశేమిరా అంటుండటంతో ఉన్నతాధి కారులు సైతం మల్లగుల్లాలు పడే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు