Thursday, May 9, 2024

తెలంగాణ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన దినం

తప్పక చదవండి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కొన్ని ఘట్టాలలో అక్టోబర్‌ 3వ తేదీకి తగు ప్రాధాన్యత ఉంది. ఆ దినం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి మండలి ఆమోదం తెలిపిన దినం. ఈ ముఖ్య ఘట్టం పూర్వా పరాలను ఒక్కసారి మననం చేసుకునే ప్రయత్నం. 1947, ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత పోలీసు చర్య ద్వారా 1948, సెప్టెంబరు 17 న ఇది భారత దేశంలో కలప బడిరది. 1948 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగింది. 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరుగగా హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్ప డిరది. వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాల నుండి భద్రాచలం, దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. 2001, ఏప్రిల్‌ 27న కె.చంద్రశేఖర్‌ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2009 నవంబర్‌ 29న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచి, ఢల్లీి పాలకుల చేత రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు మూలమైన నేపథ్యం, నివేదిక కూడా ఇచ్చాయి. డిసెంబర్‌ 9.. 2009న కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఆ రోజు అర్థరాత్రి.. అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ద్వారా ప్రకటింప చేశారు. అయితే రోజులోనే పూర్తిగా మారి పోయింది. తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు.. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజీనామాలతో ఒక్కటయ్యారు. సీమాంధ్ర నేతల తీరుతో కేంద్రం కూడా వెనక్కి తగ్గింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పక్కన పెట్టింది. ఈ ఆలస్యమే తెలంగాణ ఉద్యమ కారుల్లో మరింత ఉద్రేకాన్ని రగిల్చింది. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ‘‘ఐక్య కార్యాచరణ సమితి’’ ద్వారా వివిధ రూపాలలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలం గాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభిం చింది. 2014 జూన్‌ 2 న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. కేసిఆర్‌ నేతృత్వం లోని తెరాస తొలి మలి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి.
` రామ కిష్టయ్య సంగనభట్ల 9440595494

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు