Monday, April 29, 2024

కేటిఆర్ అండదండలే శ్రీరామరక్ష…( నిస్సిగ్గుగా కోమటికుంట కబ్జా..)

తప్పక చదవండి
  • వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ కబ్జాల పరంపర..
  • ఆ పేరుతో సీ.ఏస్.అర్ నిధులు సైతం హరోం హర..
  • కబ్జాకోరు విజయ్ కుమార్ పై బాచు పల్లి పోలీస్ స్టేషన్ లో
    నమోదైన కేసుల సంగతేంటి..
  • మిషన్ కాకతీయ నిధులు.. చెరువుల అభివృద్ధి సొల్లు..
  • కబ్జాలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీకి అభివృద్ధి పేరుతో
    చెరువులను కట్టబెట్టడంతో మతలబేంటి..?
  • కబ్జాలకు పాల్పడే నిర్మాణ సంస్థలకు మంత్రి
    మద్దతుల పై వెల్లు వెత్తుతున్న విమర్శలు..
  • కబ్జాలను ఇంటిపేరుగా మార్చుకున్న వాసవి నిర్మాణ సంస్థ..
  • దొంగచేతికే తాళాలు అన్నారు ఆ సంస్థకే అవార్డులిచ్చిన కేటీఆర్..
  • నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టి సారిస్తే తప్ప ప్రక్షాళన తప్పదా..?
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజిక వేత్తలు..
  • సి.ఏస్.అర్. నిధుల దుర్వినియోగంపై సీబీఐలో
    ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్..

గజదొంగలని తెలిసి కూడా.. బాండాగారాన్ని కాపాడమని ఆ దొంగలచేతికే రక్షణకోసం వేసిన తాళాలకు సంబంధించిన తాళాల గుత్తి అప్పగించాడట ఓ యువరాజు.. కారణం ఏమిటంటే.. తన తండ్రి అయిన రాజుకు తెలియకుండా దొంగల సహాయంతో ఖజానాను అప్పనంగా దోచుకుని, దాచుకోవచ్చన్నది అతగాడి ఆలోచన.. ఇందులో నిఘాఢమైన ఒక రహస్యం దాగివుంది.. అదేంటంటే.. ఒకవేళ తాను చేసిన ఘనకార్యం బైటపడ్డా.. నిండా రాజుమీదకే వస్తుందికదా..? తద్వారా అధికారం కూడా చేజిక్కించుకోవచ్చు.. ఒక దెబ్బకు రెండు పిట్టలు.. ఇది రాజులకాలం నాటి ఒక అవినీతి కథ.. ప్రస్తుతం తెలంగాణ రాజ్యంలో కూడా ఇదే తంతు జరుగుతోంది.. యువరాజైన కేసీఆర్ ఈ కథలో చెప్పినట్టుగానే దొంగ చేతికే తాళాలు ఇచ్చేశాడు.. సక్సెస్ అయితే కోటాను కోట్లు.. ఒక వేళ లీక్ అయితే..
సీఎం పీఠం మీద కూర్చున్న కేసీఆర్ కి అపవాదు.. ఏది ఏమైనా యువరాజా వారి కత్తికి రెండువైపులా పదునే.. చూద్దాం ఆ కథా కమామీషు..

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజిక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, బాచుపల్లి శివారులో ఉన్నటువంటి కోమటి కుంట చెరువుపై కన్నేసిన వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ చెరువును మట్టితో పూడ్చి, యదేచ్చగా కబ్జా చేస్తూ ఎఫ్టీఎల్ లో భారీ నిర్మాణాలు చేపట్టింది.. అక్రమంగా భారీ భవనాన్ని నిర్మించి అమాయక ప్రజలకు అంటగట్టి, సొమ్ము చేసుకుంటున్న వాసవి నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్ పై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి.. ఎఫ్టీఎల్ లో నిర్మించిన భారీ భవనాలు భవిష్యత్ లో కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది.. అవేమి పట్టని వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ ధనార్జనే ద్యేయంగా చెరువులో భారీ నిర్మాణాలు చేపట్టి, దొడ్డి దారిన అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతూ.. యథేచ్ఛగా అక్రమాలకు తెర లేపింది.. అన్యాక్రాంతమవుతున్న కోమటికుంట చెరువులో నిర్మించిన నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. స్థానిక ఇరిగేషన్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సదరు అక్రమ నిర్మాణాలపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా నేటికీ అవేమి పట్టనట్టుగా చట్టాలను భేఖాతరు చేస్తూ తమ అక్రమ నిర్మాణాలను మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు..

- Advertisement -

కబ్జాకు పాల్పడ్డ విజయ్ కుమార్ పై కేసులు నమోదు చేసినప్పటికీ, నేటికీ కబ్జాదారుడిని అరెస్టు చేయకుండా, అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా ఉండటం వెనుక రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండదండలు మొండుగా ఉన్నాయని స్పష్టమవుతోంది.. కబ్జాకు గురి అయిన చెరువును అభివృద్ధి పేరుతో వాసవి నిర్మాణ సంస్థకు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాయడం ఆ సంస్థకు, మంత్రికి ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తుంది.. గతంలో మిషన్ కాకతీయ పేరుతో చెరువుల అభివృద్ధి చేస్తామన్నామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పటికి చెరువు అభివృద్ధి కాలేదు అంటూ కబ్జాలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీకి, వారి యొక్క కబ్జాను కప్పిపుచ్చడానికి మంత్రి సీఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి చేయడానికి ఇవ్వాలంటూ అధికారులకు లేఖ ఇవ్వడం వారి అవినీతికి అద్దం పడుతోంది.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించాలని నిబంధనలు ఉన్నా కూడా వాటిని బేఖాతరు చేస్తూ, వాసవి నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాలో కోమటికుంట చెరువు అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను దారి మళ్లించడం వెనుక భారీ అవినీతి దాగుందని బక్క జడ్సన్ ఆరోపించారు .. వాసవి నిర్మాణ సంస్థ సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం చేయడంపై ఆయన సిబిఐకి ఫిర్యాదు చేశారు.. సీఎస్ఆర్ నిధుల గోల్ మాల్ పై విచారణ జరిపి, బాద్యులపై చర్యలు చేపట్టాలని అయన డిమాండ్ చేశారు.. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూటికతీత కోసం.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది వాస్తవం కాదా.. ?

అన్నది ప్రశ్నార్ధకంగా మారింది..? నోటిఫైడ్ కుంటగా కోమటికుంటను హెచ్ఎండిఏ, న్యాక్ కమిటీ గుర్తించినప్పటికీ చెరువు అభివృద్ధికి నోచుకోకుండా చేసి, ఎఫ్టీల్ ను కనుమరుగు చేయడంలో వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ.. అభివృద్ధి పేరుతో కలరింగ్ ఇస్తుంది.. కోమటికుంట చెరువుకు అభివృద్ధికి మిషిన్ కాకతీయ నిధులు కేటాయించారా..? ఇస్తే ఆ లక్షల రూపాయల నిధులు ఏమయ్యాయి..? కబ్జాలు చేసే వాసవి అర్బన్ నిర్మాణ సంస్థకు అవార్డులు ఇస్తున్న మంత్రి కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని పలువురు సామజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. సిఎస్ఆర్ నిధులు కబ్జాల కోసం కేటాయించారా..? లేదా సామాజిక సేవా కార్యక్రమాల కోసం కేటాయించారా.. అనే విషయాన్ని తేల్చి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో అన్యాక్రాంతమవుతున్న చెరువులు, కుంటలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టి సారిస్తే తప్ప.. చెరువుల పరిరక్షణ జరిగే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది.. వాసవి నిర్మాణ సంస్థ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు కబ్జాలు చేసింది..? ఎల్.బి. నగర్ మెట్రో స్టేషన్ కు వాసవి ఎల్బీ నగర్ గా పేరు మార్చడం ఎలా సాధ్యమైంది..? వాసవి అర్బన్ నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఎదురైన సవాల్ ఏంటి..? సి.ఎస్.ఆర్. నిధుల దారి మల్లింపు.. లాంటి కళ్లుచెదిరే మరెన్నో వాస్తవాలను, వాసవి అక్రమాల చిట్టాను మరికొన్ని కథనాల ద్వారా వెలుగులోకి తేనుంది ” ఆదాబ్ హైదరాబాద్ “… ” మా అక్షరం అవినీతిపై అస్త్రం ” ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు