Friday, May 3, 2024

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

తప్పక చదవండి

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం అయ్యింది. తిరుమల ఇందుకు ముస్తాబయ్యింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరయనుంది. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు ఇవో ధర్మారెడ్డి చెప్పారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 235 చక్రస్నానం నిర్వహించనున్నట్లు గరుడవాహన సేవ దర్శనాన్ని ఎక్కువ తెలిపారు. మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అదేవిధంగా, ఎక్కువ మంది సామాన్య భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడసేవను దర్శించుకునేందుకు వేలాది మంది. భక్తులు ముందురోజు నుండే గ్యాలరీల్లో నిరీక్షిస్తుంటారు. వారి సౌలభ్యం మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహనసేవ నిర్వహిస్తారు. కాగా, అక్టోబరు 19న సాయంత్రం 6.15 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. తరువాత సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుండగా, ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు గరుడసేవ సమయాన్ని అరగంట ముందుకు మార్చడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసారు. 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరు. వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు గ్యాలరీలలో వేచి ఉంటారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్య సాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి టీటీడీతో సమన్వయం చేసుకొని అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం. సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే. అనుమతిస్తారు. అక్టోబరు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు