Saturday, April 27, 2024

అలా కూల్చివేశారు.. ఇలా నిర్మిస్తున్నారు..?

తప్పక చదవండి
  • అక్రమ నిర్మాణ దారులకు వత్తాసు పలుకుతున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు?

గడ్డిఅన్నారం : అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది చట్టం, నియమ నిబంధనలతో ఏ మాత్రం వర్తించవు అంటూ ఇష్టానుసారంగా అక్రమ నిర్మా ణాలు నిర్మిస్తున్నారు కొందరు.. అక్రమ నిర్మాణాలకు కేంద్ర బిందువుగా సరూర్‌ నగర్‌ సర్కిల్‌ మారిపోయింది అందుకు ఉదా హరణలు సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 లో అక్రమ నిర్మాణాలపై మీడియాలో కథనాలు రానీ రోజు అంటూ ఉండదు… గడ్డిఅన్నారం డివిజన్‌, కమలానగర్‌లో ఓ నిర్మాణ దారుడు రెండు అంతస్తు లకు అనుమతులు తీసుకొని నాలుగు, అంతస్తుల, పెంట్‌ హౌస్‌ నిర్మిస్తున్నాడు… పలు దిన పత్రికలలో వార్త కథనాలు ప్రచు రించబడ్డాయి.. ఈ అక్రమ నిర్మాణం పై ఆదాబ్‌ హైదరబాద్‌ దిన పత్రికలో జూన్‌ 26 న, జూలై 4 న కథనాలు ప్రచురిం చింది, పలు ఫిర్యాదుల అనంతరం ఆగస్ట్‌ 5, 2023 న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ నిర్మా ణాన్ని తాత్కాలికంగా కూల్చి వేసారు.. తాత్కాలిక, కూల్చివేతల పై ఆదాబ్‌ హైదరబాద్‌ దిన పత్రికలో తాత్కాలిక కూల్చివేతలు దేనికి సంకేతం, అని ఇలా కూల్చి వేయడం అలా నిర్మించడం షరా మామూలే అని ప్రత్యేక కథనం ప్రచురించడం జరిగింది.. ఇప్పుడు ఆ నిర్మాణ దారుడు యధ, విధిగా అక్రమ నిర్మాణాన్ని నిర్మిస్తున్నాడు.. అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడం లో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని.. ఇలా తాత్కాలికంగా కూల్చి వేయడం, అలా అక్రమ నిర్మాణ దారులు నిర్మించడం.. చీకటి ముడుపులు తీసుకొని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారికి వత్తాసు పలకడం కామన్‌ మారిపోయిందని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. మరి చట్టాలు, నియమ, నిబంధనలు ఏందుకని.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.. మరి అధికారులు ఏవిధంగా స్పందిస్తారో మరో కథనంలో చూద్దాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు