Saturday, May 4, 2024

తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చారు..

తప్పక చదవండి
  • ఆత్మకూర్‌, మక్తల్‌ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తాం
  • వచ్చిన మఖ్తల్‌ కోర్టు వెనక్కి పోయింది
  • బలహీన వర్గాల బిడ్డగా శ్రీహరికి అవకాశం
  • ఉచిత కరెంటుపై తొలి సంతకం పెట్టింది కాంగ్రెస్‌
  • కేసీఆర్‌కుమూడోసారి అవకాశం ఇస్తే మనవడికి సైతం పదవి
  • మక్తల్‌ ప్రచార సభలో నిప్పులు జరిగిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

మఖ్తల్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ పరిధిలో ఆత్మకూర్‌, మక్తల్‌ రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలోని గార్లపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రచార సభకు రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పెద్దలు రాహుల్‌ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్‌ ఖర్గే మక్తల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వాకిటి శ్రీహరినే నియమించారని అన్నారు. వాకిటి శ్రీహరి కోటీశ్వరుడు వ్యాపారవేత్త కాదని… సామాన్య కార్యకర్త అని… గ్రామస్థాయి నుంచి సర్పంచ్‌ గా జడ్పిటిసిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 30 ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న వ్యక్తిని.. అలాంటి సామాన్య కార్యకర్తకు సైతం ఎమ్మెల్యే టికెట్‌ కేవలం కాంగ్రెస్‌ పార్టీలో మాత్రమే సాధ్యమని అన్నారు. స్వర్గీయ దయాకర్‌ రెడ్డి తనకు కుటుంబ పెద్దన్న లాగని, ప్రశాంత్‌ రెడ్డి యువకుడు అవకాశం ఇమ్మని కోరాడని… అయితే మక్తల్‌ నుంచి బలహీనవర్గాల బిడ్డగా వాకిటి శ్రీహరికి అధిష్టానం అవకాశం కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో 11% ముదిరాజులు ఉంటే 119 నియోజవర్గాలలో ఒక్క సీటు కూడా ముదిరాజులకు ఇవ్వలేదని.. దీంతో ఆత్మగౌరవం కోసం ముదిరాజులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మక్తల్‌ టికెట్‌ తో పాటు, పటాన్‌ చెరు, రాజేంద్రనగర్‌, గోషామహల్‌ టికెట్లను ముదిరాజులకు కేటాయించిందన్నారు. ముదిరాజులకు బిసి-డి నుంచి బీసీఏ గ్రూపునకు మార్చింది కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. ఆత్మ గౌరవం కోసం ముదిరాజులు కొట్లాడుతున్నారని తెలిపారు. స్వర్గీయ దయాకర్‌ అన్నా బతికున్నప్పుడు అక్రమ ఇసుక కొట్టకుండా కాపాడారని, ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుక భూ అక్రమదారుడుగా నిలుస్తున్నారని, దళిత బందులో 30% కమిషన్‌ తీసుకుంటున్నారని, కాంట్రాక్టులు ఇతర పనుల కోసం అందరిని తిట్టి కొట్టి బెదిరిస్తున్నారని విమర్శించారు. అక్రమ ఇసుక దోపిడీలో అభివృద్ధి సాధించారా… భూ అక్రమాలలో అభివృద్ధి సాధించారా… లేక తిట్టి కొట్టడంలో అభివృద్ధి సాధించారని స్థానిక ఎమ్మెల్యేను రేవంత్‌ ప్రశ్నించారు. నియోజకవర్గ పొలిమేరల వరకు గొర్రె పిల్లలను ఈడ్చుకొని వెళ్లినట్టు ఈడ్చుకెళ్ళి కృష్ణా నదిలో కలపాలని సూచించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్బి స్టేడియం ప్రమాణ స్వీకారోత్సవ సభ సాక్షిగా అప్పటి ముఖ్య మంత్రి వైయస్సార్‌ తొలి సంతకం పెట్టింది ఉచిత కరెంటు ఫైల్‌ మీదనేనని గుర్తు చేశారు. మక్తల్‌ సబ్‌ స్టేషన్‌ వద్దకు వస్తే కరెంట్‌ లాక్‌ బుక్స్లను పరిశీలిద్దాం అని… లాగ్‌ బుక్కులలో 24 గంటలు కరెంటు ఇచ్చినట్లయితే తాను వాకిటి శ్రీహరి నామినేషన్లు విత్‌ డ్రా చేసుకుంటామని అన్నారు. లేకపోతే ప్రజలే బట్టలిప్పి కొడతారని సూచించారు. తప్పుడు వాగ్దానాలతో రెండు సార్లు సీఎం అయ్యారని… రెండుసార్లకు లక్ష కోట్లతో పాటు, పదివేల ఎకరాలు చెరపట్టారని… మూడోసారి సీఎం అయితే మరో లక్ష కోట్లు సంపాదించి మనవడికి సైతం పదవి దక్కుతుందని విమర్శించారు. మక్తల్‌ లో ఎవరికైనా డబుల్‌ బెడ్‌ రూమ్‌ వచ్చిందా అని, డిగ్రీ కాలేజీ వచ్చిందా? నర్వకు జూనియర్‌ కాలేజీ వచ్చిందా.. వంద పడకల ఆసుపత్రి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగి పాపం పండిరదని… గుడిని గుడిలోని లింగాన్ని మింగే రకం సీఎం కేసీఆర్‌ ది అన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని… నాగార్జునసాగర్‌ శ్రీశైలం జూరాల బీమా నెట్టెంపాడు కోయిల్‌ సాగర్‌ శ్రీ రామ్‌ సాగర్‌ దుమ్ముగూడెం రాజీవ్‌ సాగర్‌ ఇందిరా సాగర్‌ ప్రాజెక్టు లతోపాటు మెట్రో ఎయిర్పోర్ట్‌ హైటెక్‌ సిటీ అన్ని కట్టింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. మక్తల్‌ లో హైవే తో పాటు… కృష్ణా నది మీద బ్రిడ్జి సైతం కట్టింది కాంగ్రెస్సేనాన్ని తెలిపారు. పాలమూరు బిడ్డగా నారంపేట జిల్లా పరిధిలో పోటీ చేస్తున్నానని… ఉమ్మడి జిల్లాలో 14 కు 14 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలిపించి తనకు మద్దతుగా నిలవాలని అంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… మక్తల్‌ కు కేటాయించిన కోర్టును సైతం తీసుకురాలేకపోయారని… సబ్‌ రిజిస్టర్‌ భవనాన్ని సైతం వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. డిగ్రీ కాలేజ్‌ కి భవనం సైతం లేదని ఆత్మకూరు మక్తల్‌ రెవెన్యూ డివిజన్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. మక్తల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ గుర్తు చేయిగుర్తుకు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీపీ చంద్ర కాంత్‌ గౌడ్‌ అండ్‌ టీమ్‌ రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ వనజ ఆంజనేయులు గౌడ్‌, మల్లు రవి, నేతలు బాలకృష్ణారెడ్డి, కొత్తకోట సిద్ధార్థ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, పోలీస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, నాగరాజు గౌడ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, గవినోళ్ల గోపాల్‌ రెడ్డి, రవికుమార్‌ యాదవ్‌, గడ్డంపల్లి హనుమంతు, కోళ్ళ వెంకటేష్‌, పారేవుల విష్ణు, రవికుమార్‌ , గణేశ్‌ కుమార్‌, అన్ని మండలాల అధ్యక్షులు యూత్‌ కాంగ్రెస్‌ నేతలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు