- రూ.5 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరణ
శామీట్ పేట్ : గుర్తుతెలియని దుండ గులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్ పేట్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లే రహదారి పక్కన ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలోకి ఆదివారం గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని సుమారు 5 లక్షల నగదు, 3 తులాల బంగారం, 5 కిలోల వెండి వస్తువులు అపహరించి పారిపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీ సులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు స్వీకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.