Wednesday, May 8, 2024

రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం దక్కేనా?

తప్పక చదవండి

గోల్కొండ పూర్వ నామం గొల్లకొండ.గొల్లకొండ పరిసర ప్రాంతాల్లో యాదవులు అధిక సంఖ్యలో నివసించే వారు.16 శతాబ్ధంలో గోల్కొండకు సమీపంలోనే హైదరాబాద్‌ నగర నిర్మాణం జరిగింది.హైదరాబాదు నిర్మాణం తర్వాత కుతుబ్‌ షాహి,అసఫ్‌ జాహి పాలనలో యాదవులు సైనికులుగా,యుద్ద వీరులుగా ప్రముఖ పాత్ర పోషించారు.బ్రిటిష్‌ వారి కాలంలో అహిర్‌ రెజ్మెంట్‌ గా పేరు గాంచిన యాదవ సైన్యం 1853 వరకు నిజాం సైన్యంలో భాగంగా ఉంటు నిజాం(హైదరాబాద్‌) రాజ్యానికి రక్షణ కల్పించింది. హైదరాబాద్‌ నగరం పెరిగినట్లు యాదవుల జనాభా కూడా నగరంలో పెరిగింది. హైదరాబాదులో యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.యాదవులు సదర్‌ ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన దున్నల ప్రదర్శన దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది.ఆలైబలై ఉత్సవం అన్ని పార్టీల నాయకులను,అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి ఆహ్వానిస్తుంది.హైదరాబాద్‌ లోనే గాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా యాదవులు (గొల్ల, కుర్మలు) అధిక సంఖ్యలో ఉన్నారు.ఇతర వెనుకబడిన తరగతులలో యాదవులు సంఖ్య పరంగా మొదటి వరుసలో ఉంటారు. రాష్ట్రంలోనేగాక దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో యాదవులు సుమారు 20 శాతం జనభాతో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలంగా ఉన్నారు.ఇతర వెనుకబడిన తరగతుల లో ప్రముఖంగా ఉన్న యాదవులు ఓబీసీ రిజ్వేషన్ల పోరాటంలో ముందు వరుసలో ఉన్నారు. బిపి మండల యాదవ్‌ సిఫారసుల వల్లనే ఓబీసీ రిజ్వేషన్లు అమల్లోకి రాగలిగాయి.ఓబీసీ రిజ్వేషన్ల అమాలుకై యాదవ త్రయం ములాయం సింగ్‌ యాదవ్‌,లాలూ ప్రసాద్‌ యాదవ్‌,శరత్‌ యాదవ్‌ గార్లు ప్రముఖంగా ఉద్యమించారు. దేశ వ్యాప్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో నలుగురు యాదవులకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్లో బిజెపి పార్టీ యాదవులకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది.బీహార్‌కు ఉప ముఖ్య మంత్రిగా తేజస్వి యాదవ్‌ పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌, మహారాష్ట్ర,గుజరాత్‌,జార్కండ్‌ లాంటి రాష్ట్రాలతోపాటు ఉత్తర భారత దేశంలో రాజకీయంగా యాదవులు చైతన్య వంతులుగా ఉన్నారు. తెలం గాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయ లాంటిది,హైదరాబాద్‌ కు యాదవు లు గుండెకాయ లాంటివారు. గతంలో హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి యాదవులు తప్పనిసరిగా ఒక్కరైనా ఎమ్మెలేగానో, ఎంపిగానో లేక రాష్ట్ర మంత్రిగానో,కేంద్ర మంత్రిగానో మంత్రివర్గంలో ఉండేవారు. బండారు దత్తా త్రేయ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,అంజన్‌ కుమార్‌ యాదవ్‌, కృష్ణ యాదవ్‌ ఇలా ఎవరో ఒకరు హైదరాబాద్‌ -సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవుల తరఫున కూడా ప్రాతినిధ్యం వహించే వారు. గత ప్రభుత్వ పాలనలో తెలం గాణ రాష్టా నికి ప్రధానమంత్రితో పాటు ఇతర ఏ ప్రముఖులు హైదబాద్‌ నగరా నికి వచ్చిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నగరానికి ఆహ్వానించేవారు.గత ప్రభు త్వ కాలంలో యాదవుల నుంచి ఒక మంత్రి,ఐదుగురు ఎమ్మెలేలు, ఇద్దరు ఎమ్మె ల్సీలు, ఒక రాజ్యసభ సభ్యులు,కొందరు కార్పొరేషన్‌ చైర్మన్లు ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు జనాభా దామాషా ప్రకారం 22 ఎమ్మెల్యే స్థానాలు,7 ఎమ్మెల్సీ స్థానాలు,3 లోక్‌ సభ స్థానాలు,2 రాజ్యసభ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి.కానీ గత నెలలో జరిగిన శాసన సభ ఎన్ని కల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ 5,కాంగ్రెస్‌ పార్టీ 4, బిజెపి పార్టీ 5 స్థానాలు మాత్రమే కేటాయించాయి. కానీ బిఆర్‌ఎస్‌లో ఒకరు, కాంగ్రెస్‌లో ఒకరు మాత్రమే గెలి చారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు జనాభా దామాషా ప్రకారం దక్కా ల్సిన స్థానాలు,ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ ఎన్నికల్లో యాదవుల ప్రాతినిధ్యం అధి కార పక్షంలో ఒకరు,ప్రతిపక్షంలో ఒకరుగానే మిగిలింది. అంటే ఆయా రాజ కీయ పార్టీలు గెలిచే స్థానాలే ఇచ్చాయా లేకా లెక్క సరిచేయడానికి ఓడిపో యే స్థానాలే ఇచ్చాయా అనేది యాదవులు గుర్తిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో తప్పనిసరిగా యాద వులకు ప్రాతినిధ్యం ఉండేది. ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో యాదవు లకు ప్రాతినిధ్యం లభించలేదు. బీర్ల ఐలయ్యకి ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించడం హర్షించదగ్గ పరిణా మం. కానీ హైదరాబాద్‌ నగరానికి, అందులో హైదరాబాద్‌లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు ప్రాతినిధ్యం లేక పోవటాన్ని కాంగ్రెస్‌ పార్టీ మారో మారు పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఇప్పటికే అఖిల భారత యాదవ మహాసభ,యాదవ హక్కుల పోరాట సమితి, గొర్ల కాపర్ల సహకార సంఘాలు,యాదవ విద్యా వంతుల వేదిక లాంటి సంఘాలతో సంఘటితంగా ఉన్నారు.వారందరి ఉమ్మడి కోరిక గతంలో లాగానే రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు ప్రాతినిద్యం కల్పించాలని. ముఖ్యమంత్రితో కలిపి నలుగురు రెడ్లు, ఇద్దరు దళితులు,ఒక ఆదివాసీ,ఒక బ్రాహ్మణ,ఒక వెలమ,ఒక కమ్మ, ఇద్దరు బిసిలతో రాష్ట్ర క్యాబినెట్‌ కొలువు తీరింది.కానీ రాష్ట్ర మంత్రివర్గంలో 50 శాతానికి పైనున్న బిసి వర్గాలకు ఇద్దరు మాత్రమే ప్రాతి నిద్యం వహిస్తు న్నారన్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి.ఏ లెక్కన్న చూసిన కనీసం 6గురు బిసిలకైన ప్రాతినిద్యం కల్పించాలి. ఇప్పటికే గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించిన్నందున రాబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో తప్పనిసరిగా యాదవ సామాజిక వర్గా నికి ఒక మంత్రి పదవి కేటాయించాలి. ఇప్పుడున్న రాష్ట్రమంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాద్‌ జిల్లాకు ప్రాతినిద్యం లభించలేదు. రాష్ట్ర రాజధా నిగా ఉన్న జిల్లాకు ప్రాతినిధ్యం లభించక పోవడం ఆశ్చరం కల్గిస్తుంది. హైదరా బాద్‌కు ప్రాతినిధ్యం కల్పించాలన్న, హైదరాబాద్‌లో, రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు ప్రాతిని ధ్యం లభించలన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హైదరా బాద్‌లోని యాదవులకు రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రాతినిద్యం కల్పించాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్న యాదవులకు రాజకీయంగా సరైన స్థానం లభించలేదు.ఎమ్మెల్సీ స్థానా ల్లోనైన యాదవులకు జనాభా దామాషా ప్రకారం వాట దక్కాలి.ఇక రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, సభ్యులు, ప్రముఖఆలయాల్లో చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ రంగసంస్థల్లో నామినేటెడ్‌ పదవులు ఉన్నాయి.జనాభా దామాషా ప్రకారం యాదవులకునామినేట్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు కేటాయించాలి. రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపిపి లు, సర్పంచులు తదితర స్థానిక సంస్థల పదవుల్లో అన్ని రాజకీయ పార్టీ లు యాదవులకు జనాభా దామాషా ప్రకారంసీట్లు కేటాయించాలి. దేశంలో రాష్ట్రం లో పెద్దసంఖ్యలో ఉన్న యాదవులను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించకూడ దు. రాను న్న అన్ని నియామకాల్లో, ఎన్నికల్లో యాదవులకు జనాభాదామాషా ప్రకా రం స్థానాలు కేటాయించాలని, రానున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో యాద వుల కు తప్పనిసరిగా స్థానంకల్పించాలని అన్నియాదవసంఘాలు కోరుతున్నాయి.
` జుర్రు నారాయణ యాదవ్‌ 9494019270

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు