Sunday, May 5, 2024

నిరంకుశపాలనకు, ఇందిరమ్మ రాజ్యంకు జరుగుతున్న యుద్ధం

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్రంలో భోగాన్ని అనుభవిస్తున్న కేసీఆర్‌ కుటుంబం
  • మనకష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి
  • ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌
  • కాంగ్రెస్‌పార్టీ వచ్చి 150సంవత్సరాలు
  • బీఆర్‌ఎస్‌కు బీజేపీికి ఉన్న లాలూచీ ఏంటి?
  • ఎన్నికల ప్రచారంలో పొంగులేటి

కూసుమంచి ; నిరంకుశ పాలనకు ఇందిరమ్మ రాజ్యంకు జరుగుతున్న యుద్ధమని కాంగ్రెస్‌పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం, రాజుపేట, రాజుపేటబజార్‌, తాళ్లగడ్డతండా, ఈశ్వరామాదారం, మద్దివారిగూడెం, బందడి నరసయ్యగూడెం, మంగలితండా, బికారితండా, భగత్‌వీడు, సోమ్లాతండా, సీతల తండా, పాలేరు,భోజ్యతండా, నాన్‌తండా గ్రామాల్లో పొంగులేటి ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెచ్చుకున్న తెలంగాణరాష్ట్రంలో భోగాన్ని అనుభవిస్తుంది కెసిఆర్‌ కుటుంబమని, రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును దోచుకోమని ఇవ్వలేదు కెసిఆర్‌కి అన్నారు. మీరందరూ బచ్చాగాళ్లు కాంగ్రెస్‌ పార్టీ వచ్చి 150 సంవత్సరాలు అని అవన్నీ మరిచి పోయి కాంగ్రెస్‌ పార్టీని విమర్శించేస్థాయి మీది కాదని విమర్శించారు. కట్టక కట్టక ఒకప్రాజెక్టు కడితే ఒకంటి కుంగిపోయిందని, మరొకటి నేర్రెలు ఇచ్చిందని, ఎందుకు కెసిఆర్‌ను కేంద్రం అరెస్టు చేయ లేదు, బీఆర్‌ఎస్‌కు బీజెపీకి ఉన్న లాలూచి ఏంటి లక్ష కోట్లల్లో మీకు వాటా ఇచ్చారాని ప్రశ్నించారు. మనకష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని వచ్చిన వెంటనే నియోజకవర్గంలో యాదవ సోదరులు అప్పులు తెచ్చి డీడీలు కట్టిన యాదవులకు ఇంత వరకు గొర్రెలు పంపిణీ చేయలేదని, రూ.43వేల డీడీలు రెండు సంవత్సరాల క్రితం కట్టి మోసపోయిన నాయాదవ సోదరులందరికీ మొదటి పనిగా వీళ్ల ముక్కుపిండి కట్టిన డబ్బులకు గొర్రెలు అందచేయడం జరుగుతుందని మీ శ్రీనన్నభరోసా ఇస్తున్నానని పేర్కొన్నారు. గ్యాస్‌సిలెండర్‌ రూ.500లకే ఇస్తామని, ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే భర్తీ చేస్తామని అన్నారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని కాదని మాయమాటలు నమ్మి కెసిఆర్‌ రెండు సార్లు అధికారం ఇచ్చారని, కాని దళితబంధు, దళితులకు మూడుఎకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లాంటి వాగ్ధానాలు తెలంగాణప్రజలకు ఇచ్చిన కెసిఆర్‌ వాటిని నిలబెట్టుకోలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం ఆరు రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప యువతకు ఒక్క ఉద్యోగం రాలేదని,యువతను రైతులను మహి ళలను గిరిజనులను మోసం చేశారన్నారు. తెలంగాణప్రజలను మరోసారి మోసం చేసి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని తెలిపారు. సిపిఐపార్టీకి 119నియోజక వర్గాల్లో మాకు మద్దతిస్తుందని, షర్మిల స్వచ్ఛందంగా కెసిఆర్‌ పాలన రావద్దని కాంగ్రెస్‌పాలనకు మద్దతు పలికారని కాంగ్రెస్‌ తరుపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, స్వర్ణకుమారి, మట్టే గురవయ్య,మల్లేష్‌,ఉపేందర్‌రావు, సూర్య నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, వాసు, సుధాకర్‌రెడ్డి, నాగిరెడ్డి రమేష్‌రెడ్డి, గోపాల్‌రావు, ముత్తయ్య పిర్యానాయక్‌, హఫీజ్‌వుద్ధీన్‌, అంజిరెడ్డి, వీరారెడ్డి, కందుల కృష్ణ, రాంబాబు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు