Friday, May 3, 2024

తీరనున్న మఖ్తల్‌ ప్రాంతవాసుల రైల్వే కల…

తప్పక చదవండి
  • 1వ తేదీ నుంచి క్రిష్ణ – పాలమూరు మధ్య రైలు సౌకర్యం…
  • ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
  • మఖ్తల్‌ మీదుగా హైదరాబాద్‌కు ట్రెయిన్‌ సౌకర్యం

మఖ్తల్‌ : మఖ్తల్‌ నియోజకవర్గ వాసులకు.. ముఖ్యంగా మఖ్తల్‌ పట్టణం మీదుగా రైలు ప్రయాణం చేయాలన్న కల ఎట్టకేలకు నెరవేరనుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి క్రిష్ణ – పాలమూరు మధ్య రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. క్రిష్ణ నుంచి మఖ్తల్‌, జక్లేర్‌, మరికల్‌ మీదుగా పాలమూరు, కాచిగూడ వరకు రైలు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దశాబ్దాల నుంచి కలగా ఉన్న మఖ్తల్‌ పట్టణ రైల్వే కల తీరనుంది. ఇక నుంచి అతి తక్కువ ధరకు, పూర్తి రైల్వే సౌకర్యంతో రాజధాని హైదరాబాద్‌ కు రైల్వే ప్రయాణం అందుబాటులోకి రానుండటంతో మఖ్తల్‌ పట్టణ, నియోజకవర్గ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైల్వే సాకారం కల తీరడంలో కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు