Thursday, May 2, 2024

గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి మొదటి ఫొటో….

తప్పక చదవండి

ఐదు దశాబ్దాల కోట్లాది మంది కల సాకారమైంది. అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రామనామ స్మరణల మధ్య సోమవారం సరిగ్గా ‘అభిజిత్‌ లగ్నం’లో పెట్టిన 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడు కొలువుదీరాడు. 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్రతువును చేపట్టారు. ఈ మహత్తర ఘట్టాన్ని ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడి ఒరిజినల్ ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఒకవైపు లోపల గర్భగుడిలో ప్రాణప్రతిష్ట జరుగుతుండగా.. బయట ఆలయంపైనుంచి హెలికాప్టర్ల ద్వారా రామాయలంపై పూల వర్షం కురిసింది. యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరాడు. ప్రాణ ప్రతిష్టాపన అనంతరం శ్రీరాముడికి తొలి పూజ నిర్వహించారు. ఈ పూజల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు