Sunday, April 28, 2024

పుస్తకాల ముద్రణలో మామిడి హరికృష్ణ తనదైన మార్కు

తప్పక చదవండి
  • ఉద్యోగినని మరిచిపోయిన వైనం
  • కరోనా కాలంలో ఆన్లైన్‌ ప్రోగ్రామ్స్‌
  • కమిషన్‌ ఇచ్చే వారికి ప్రాధాన్యత
  • పండుగలు, ఉత్సవాల పేరుతో లక్షల ప్రభుత్వం సొమ్ము స్వాహా
  • కవులు, రచయితల తీవ్ర ఆరోపణలు
  • విచారణ చేపట్టాలని ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం నేతల డిమాండ్‌,
  • త్వరలో కార్యాచరణ ప్రకటన, ఏసీబీ అధికారులను కలవనున్నట్లు వెల్లడి

తీగలాగితే డొంక కదిలినట్లు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాయలు, కళాకారుల ఆవేదనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లు తనకు ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఎవరు నోరు మెదపలేదని చాలా మంది వాపోతున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది కవులు రచయితల మాటల్లో చెప్పాలంటే.. విస్తీ పోయే నిజాలు వినాల్సి వస్తుంది. అందుకు వారి ఆవేదన అద్దం పడుతుంది. గత పదేళ్లు ఒకే శాఖకు డైరెక్టర్‌ గా ఎలాంటి బదిలీ లేకుండా చలామణి అవుతున్నాడు. రవీంద్ర భారతి ఇలాకాలో తనకు ఎదురు లేదనే విధంగా డైరెక్టర్‌ అంచలంచెలుగా తన పేరు విస్తరింపచేసుకున్నాడని వాదన బలంగా వినిపిస్తుంది.. ఒక ప్రభుత్వ అధికారిగా ఉండాల్సిన ఉద్యోగి పేరుప్రతిష్ట కోసం ఎంతో పాకులాడారని వాపోతున్నారు. అందుకు కారణం ప్రతి ప్రభుత్వ కార్యకలాపాలలో డైరెక్టర్‌ గా తన మార్కు చూపించకున్నాడని కళాకారులు పేర్కొంటున్నారు.

ఆరోపణలు :
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిందు, యక్షగాన కళాకారులు, వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ప్రదర్శనలు, జానపద ఉత్సవాలు నిర్వహించాలంటే అందుకు కమీషన్లు ఇచ్చిన వారికే అవకాశాలు కల్పించే వారిని, కళాకారులకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లలో చేతివాటం తీసుకున్నారని కళాకారుల చెబుతున్నారు. తెలంగాణ కళారాధన పేరిట 116 రోజులు రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును తన అనుచరులకు అప్పజెప్పినట్లు తెలుస్తుంది.

- Advertisement -

అంతేకాదు తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాల నిర్వహణలోనూ డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. ఈ భారీ కుట్ర వెనుక గత ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి పేరు చెప్పి అందరినీ బెదిరించే వాడని తెలుస్తుంది. రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ భాష సాత్విక శాఖ సౌజన్యతో వందలాది ప్రోగ్రామ్స్‌ జరిగాయి. అందులో తనకు నచ్చిన కొంత మంది కళాకారులకే అంటే కమీషన్లు ఇచ్చే వారికే మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వడం పరిపాటిగా మారిందని కళాకారులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలు, బతుకమ్మ వేడుకలు, బోనాల నిర్వహణ, రవీంద్రభారతి రిపేర్ల పేరుతో లక్షల రూపాయలు వృధా చేశారని కవులు రచయితలు వాపోతున్నారు. భాషా సాంస్కృతిక శాఖ ప్రచరించిన అన్నీ పుస్తకాలకు సంపాదకడిగా తన పేరేవేసుకున్నాడని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వపరంగా ముద్రించే పుస్తకాలన్నిటిలో సిఎం, మంత్రుల పోటోలతో పాటు తన పోటో కూడా వేసుకునే వారని కవులు రచయితలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరయినా రచయితలు రాసుకున్న పుస్తకాల్లో తన పేరు పెడితేనే పుస్తకం అచ్చుకు పంపిస్తానని బెదిరించే వారిని కొందరు రచయితలు కన్నీటి పర్యంతమయ్యారు. వందేళ్ళ భారతీయ చిత్రం మరియు సాంస్కృతిక శాఖ పేరు మీద తీసిన డాక్యుమెంటరీలల్లో కమీషన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. హోదాను అడ్డుపెట్టుకుని పలు తెలంగాణ సాహిత్య అకాడమీ కి సెక్రటరీగా ఇంచార్జ్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు తీసుకుని ఉన్న కొన్ని రోజుల్లో కరోనా కాలంలో కూడా అనవసరపు ఆన్లైన్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్రమాలే చేసి డబ్బు చేసుకున్నాడు. తన పలుకుబడి పరిచయాలతో 2019 లో ఉత్తమ అధికారిగా అవార్డును తీసుకున్నాడు. తన చాకచక్యంతో పైరవీ చేసి గోల్డ్‌ మెడల్‌ తెచ్చుకున్నాడని కళాకారులు తెలిపారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు తెలంగాణలోనే ఏ ప్రభుత్వ అధికారి అనుభవించని రాచ మర్యాదలు పరిచయాలు పేరు ప్రతిష్టలు సాధించి మరో పదో పదోన్నతి కోసం పైరవీలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ కొత్త ప్రభుత్వం అయినా ఇలాంటి అధికారులు ఉపేక్షించకుండా రవీంద్ర భారతి సాక్షిగా చేసిన అక్రమాల పై విచారణ జరిపించాలని ఓయూ విద్యార్థి జేఏసీ సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తక్షణమే పై అధికారులు స్పందించాలని లేనిపక్షంలో ఓయు జెఏసి కార్యచరణ ప్రకటిస్తుందని ఒక ప్రకటన లో తెలిపారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఈ అధికారికి సంబంధించిన భాదితుల తరఫున వాట్స్‌ అప్‌ గ్రూప్‌ క్రియేట్‌ అవుతున్నట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు