Friday, May 3, 2024

అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్..

తప్పక చదవండి
  • అయన జీవితమంతా అవినీతిమయమే..
  • బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు..
  • కోర్టు మొట్టికాయలు వేసినా నిస్సిగ్గుగా విధులు..
  • ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా మారని బుద్ధి..
  • అక్రమ ఆస్తులు కూడగట్టడంలో ఈయన దిట్ట..
  • బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపులేని ఆగడాలు..
  • కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై
    దృష్టి సారించాలంటున్న సామాజిక వేత్తలు..

ఆయన వెలగబెట్టేది అత్యున్నత వుద్యోగం.. బ్యూరోక్రాట్ గా సవాళ్ళను ఎదుర్కొనే విధులు.. తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ఆయనది.. కానీ ఉద్యోగం గొప్పదైనా ఆయన బుద్ధిమాత్రం నీచం.. తనకున్న విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకుని అడ్డుగోలుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటు.. కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం.. బాధించడం.. క్షోభపెట్టడం ఆయనకు ఒక ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది.. ఇక ఫైళ్లు మార్చడం.. అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నతో బెట్టిన విద్య.. చివరికి అవినీతి అనే పదం కూడా అతగాడిని చూసి సిగ్గు పడుతుంది.. అంతటి ఘనాపాటి ఆయన.. అయన ఎవరో కాదు నవీన్ మిట్టల్ ఐఏఎస్.. అతగాడి నీచ చరిత్ర ఒకసారి గమనిద్దాం..

హైదరాబాద్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

- Advertisement -

ద గ్రేట్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు.. 1996లో ఆల్ ఇండియా సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు.. కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధుల నిర్వహణకు కేటాయించబడ్డాడు. ఆ తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన తెలంగాణకు పోస్ట్ చేయబడ్డాడు.. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.. ఆల్ ఇండియా సర్వీస్ కేడర్ అధికారిగా, ఆ సంస్థకు అధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ ఆయన ప్రవర్తన చూస్తే బాధ ఈయన ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినా అక్కడ అవినీతి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి.

కొన్ని ఉదాహరణలు చూద్దాం :

  1. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా విధాదులు నిర్వహిస్తున్నప్పుడు.. హైదరాబాద్, గుడిమల్కాపూర్, నానల్ నగర్ లో సుమారు 5,600 చదరపు గజాల మేరకు ఒక ప్లాట్‌కు సంబంధించి నో అబ్ జక్షన్ సర్టిఫికేట్ ఈయన ద్వారా జారీ చేయబడింది. ఈయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది.. హైకోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.. మోసపూరితంగా ప్రైవేట్ వ్యక్తులకు లోపాయికారి ఒప్పొందంతో వారికి సహకరించడంతో ఈయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు. అయితే ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అప్పటి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రయతించక పోవడంతో అప్పట్లో ప్రభుత్వం పై హై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.
  2. ఇక ఇతగాడు అతను ఆస్థికి సంబంధించిన కుంభకోణంలో సైతం చక్రం తిప్పాడు.. గౌరవ లోకాయుక్త పై ఆయన వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో అతగాడి చర్యలపై సుమో-మోటో కాగ్నిజెన్స్ తీసుకుంది. ఈ వ్యవహారంపై భూపరిపాలన ప్రధాన కమిషనర్‌తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై.. ప్రభుత్వం సి సి ఎల్ ఏ నుండి వివరణాత్మక నివేదికను కూడా కోరింది.
  3. ఇక నవీన్ మిట్టల్‌ హయాంలో కలెక్టరేట్‌లోని ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యాయి. చట్టానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించబడిన వివాదాస్పద ప్రధాన ఆస్తులు బతుకమ్మకుంటలో సుమారు రూ.30-కోట్ల స్థలం, బాపునగర్‌లో 10000 చదరపు గజాల స్థలం.. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 4000 చదరపు గజాల ప్రభుత్వ ఆసుపత్రి స్థలం ఉన్నాయి..

ఈయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. నవీన్ మిట్టల్, పైన పేర్కొన్న చట్టవిరుద్ధమైన చర్య కోసం 2012 సంవత్సరంలోనే ఈ వ్యవహారం జరిగింది.. , కానీ అతను తన క్రిమినల్ తెలివితేటలు ప్రదర్శించి.. తన కంటే జూనియర్ అయిన అతని వారసుడు ఛార్జ్ మెమోను సిద్ధం చేశాడనే.. సాకుతో క్యాట్ నుండి తప్పించుకోగలిగాడు.. అయితే స్వతంత్ర అధికారులతో విచారణ జరిపేందుకు హై కోర్టు ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది.. కానీ ఈ కేసు ముందుకు సాగలేదు.

ఇక ఈయనగారిపై పెండింగ్ లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బార్లు కమ్ముతాయి..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణ నం. 5-1-513/3,4, 5తో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి సిఫార్సు చేయబడింది. నాంపల్లి మండలం తోటగూడ గ్రామంలోని నం. 40 బ్లాక్-సి వార్డు 198ని ఉల్లంఘించారు. జీ ఓ ఎం ఎస్ నెంబర్ : 166 రెవెన్యూ (ఏ ఎస్ ఎస్ ఎన్ . పీ ఓ టి ) తేదీ : 16-02-2008 కింద జారీ చేయబడిన మార్గదర్శకాలు. ఇది దుర్మార్గపు ఉద్దేశ్యంతో చేయబడింది..

ఇక సర్వ్ నెంబర్ 403 లోని ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి ఈయన సిఫార్సు చేశాడు.. షేక్‌పేట్ గ్రామంలోని నం. 17 బ్లాక్-డి 108 జీ ఓ ఎం ఎస్ నెంబర్ :166 రెవెన్యూ (ఏ ఎస్ ఎస్ ఎన్ . పీ ఓ టి ) తేదీ : 16-02-2008 కింద జారీ చేయబడిన మార్గదర్శకాలను కూడా నిస్సిగ్గుగా ఉల్లంఘించాడు..

ఈయన జీ హెచ్ ఎం సి స్పెషల్ కమిషనర్ వున్నప్పుడు ఇతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ మిట్టల్ కి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనపై ఏసీబీ దాడులు చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. అయితే అతనిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా ఆయనను జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌ పోస్టు నుంచి మా ర్చి మరికొన్ని విభాగాల్లోకి మార్చారు.

కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో కమిషనర్ గా పనిచేసినప్పుడు కూడా అతని బుద్ధి మారలేదు.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను తరలించడంపై ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి.. కమిషనర్ బదిలీ అధికారాలు ఉపసంహరించబడ్డాయి. ఈయనగారి క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు..

ఇక ఈయన ఉన్నత విద్యాశాఖలో లెక్చరర్ల పోస్టింగ్‌లు, బదిలీలపై కూడా ఎన్నెన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డీ ఓ పీ టి యొక్క రికార్డుల ప్రకారం, అతను తన వార్షిక ఆస్తి రిటర్న్‌లను సున్నాగా చూపిస్తూ నిస్సిగ్గుగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి ఫైల్ చేస్తున్నాడు.. కానీ తన కుటుంబ సభ్యులు, తన దగ్గరి బంధువులు, బినామీల పేరిట ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. అతను అక్రమంగా ఎన్నెన్నో ఆస్థులు కూడబెట్టాడు..

ఇక ఆయన క్రిమినల్ ఆలోచనలకు ఇది పరాకాష్ట.. ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఆధార్ కార్డు వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.. అలా చేస్తే అక్రమాస్తులు బయటపడతాయని భావించి ఆయన భార్య పేరుమీద అదికూడా ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేసి ఆస్తులు కొనుగోలు చేసాడు.. అది కూడా ఆయనకున్న అధికారాలను అడ్డుపెట్టుకుని ఈ అక్రమం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి..

ఇవి కేవలం ఆయనగారి మీద పేర్కొన్న కొన్ని ఆరోపణలు మాత్రమే.. మొత్తం వివరాలు పేర్కొంటే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది.. అతని పూర్తి నేరాలు, కుట్రలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలు మరిన్ని కథనాల ద్వారా.. ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ఆదాబ్ హైదరాబాద్ … మా అక్షరం అవినీతిపై అస్త్రం ..

నవీన్‌ మిట్టల్‌ అక్రమంగా కూడపెట్టిన ఆస్తుల వివరాలు

  1. నవీన్‌ మిట్లల్‌ భార్య రీఘు బన్సల్‌ (సీఎల్‌), ఎ. రాంరెడ్డి, నాగిరెడ్డి, నర్సింహారెడ్డి (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 114/2023, సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌, జడ్చర్ల, వ్యవసాయ భూమి సర్వేనెంబర్‌ 507/ఎ, 492/ఎ నుండి 500/ఎఎ వరకు. రంగారెడ్డి జిల్లా, మం. రాజపూర్‌ బాలనగర్‌, ముదిరెడ్డిపల్లి గ్రామం.
  2. నవీన్‌ మిట్లల్‌ బావమర్ది సంజయ్‌ బన్సల్‌ తండ్రి హుకుంచంద్‌ బన్సల్‌ (సీఎల్‌), విఆర్‌డి డెవలపర్స్‌ సురేష్‌ కుమార్‌ అగర్వాల్‌
    సీఎస్‌కె రియాలర్ట్స్‌ లిమిటెడ్‌ (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 1475/2012, ఎస్‌ఆర్‌ఓ ఫారుఖ్‌నగర్‌, ఫ్లాట్‌నెంబర్‌ 189, 267 చ.గ., సర్వేనెంబర్‌ 357/పి., 359, 361, 362, 363, 364/పి, 365/పి, 366, 482, 483, 484, 486, 487, 492 నుండి 511 వరకు. మహబూబ్‌నగర్‌ జిల్లా, మం., ఫారుఖ్‌నగర్‌ గ్రామం.
  3. నవీన్‌ మిట్టల్‌ బావమర్ది సంజయ్‌ బన్సల్‌ అతని భార్య నీలిమా బన్సల్‌ (సీఎల్‌), ప్రమోద్‌ బన్సల్‌ (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 5116 /2016 ఎస్‌ఆర్‌ఓ చార్మినార్‌, ఇ.నెం. 217243, 217244, విస్తీర్ణం 5862.9 స్వేయిర్‌ ఫీట్‌ గల ఇల్లు కలదు.
  4. నవీన్‌ మిట్టల్‌ భార్య రీఘు బన్సల్‌ (సీఎల్‌), స్పీడ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బి. రవిశంకర్‌ (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 24392/2017 ఎస్‌ఆర్‌ఓ సంగారెడ్డి (ఆర్‌ఓ). వ్యవసాయ భూమి, 4 ఎకరాల 19 1/2 గుంటలు. సర్వే నెంబర్‌ 91/ఎఎ, 93/ఎ, 94, 99/ఎ, 103/ఎఎ లో కలదు. సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్‌ మండలం, వడక్‌పల్లి గ్రామం.
  5. నవీన్‌ మిట్టల్‌ భార్య రీఘు బన్సల్‌ (సీఎల్‌), సి. శరత్‌ మరియు సురారం రాజశేఖర్‌ రెడ్డి (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 20668/2017, 2ఎకరాల 2 గుంటలు, సర్వేనెంబర్‌ 74, 75/పి, 97, సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్‌ మండలం, వడక్‌పల్లి గ్రామం.
  6. నవీన్‌ మిట్టల్‌ బావమర్థి సంజయ్‌ బన్సల్‌ (సీఎల్‌), జి. శంకర్‌ రెడ్డి, తెల్లపాటి రెడ్డయ్య నాయుడు (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 2161/2019, ఎస్‌ఆర్‌ఓ షాద్‌నగర్‌, 2346 చ.గ. సర్వే నెంబర్‌ 279/ఎ, రంగాపూర్‌ గ్రామపంచాయతీ,
    రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, గ్రామం.
  7. నవీన్‌ మిట్టల్‌ బావమర్థి సంజయ్‌ బన్సల్‌ (సీఎల్‌), నర్సింహా రెడ్డి, తెల్లపాటి రెడ్డయ్య నాయుడు (ఈఎక్స్‌) పేరున
    డాక్యుమెంట్‌ నెం. 2160/2019, ఎస్‌ఆర్‌ఓ షాద్‌నగర్‌, ప్లాట్‌ 3099 చ.గ. సర్వే నెంబర్‌ 279/ఎ, రంగాపూర్‌ గ్రామపంచాయతీ, రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, గ్రామం.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు