Sunday, April 28, 2024

పాపాల ‘పాపారావు’..

తప్పక చదవండి
  • వెలమదొర పాలనలో అవినీతి అందలం..
  • వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం..
  • కేసీఆర్‌ రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు..
  • ఆర్‌ టి ఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ..
  • కేసీఆర్‌ కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు..
  • కేసీఆర్‌ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం..
  • తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు..
  • అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ గా విధులు..
  • రజాకార్లను తలపిస్తూ అక్రమాల భాగోతాలు..

మీకు ఎలాంటి సరైన అర్హతలు లేకున్నా పర్వాలేదు.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా వెలగబెట్టినన్ని రోజులు మీరు వెలమ కులస్తులు అయితే చాలు.. ఉద్యోగాలు.. ప్రమోషన్లు.. అయితే పెద్దదొర చెప్పినట్లు వినాలి.. దోపిడీలు చేయడంలో నిష్ణాతులు అయివుండాలి.. అంతే.. ఆ దోపిడీ సొమ్ములో దొరవారికి కమిషన్‌ రూపంలో ముట్టజెపితే చాలు.. మీ పోస్ట్‌ పదిలం.. మీకు పదోన్నతులు ఖాయం.. ఇదీ కేసీఆర్‌ పాలనలో వెలమ దొరల పరిస్తితి.. వెలమ దొరలు ఒక్క వెలుగు వెలిగారంటే అతిశయోక్తి కాదు.. ఈ కోవలోకే వస్తారు అక్రమార్క శిఖామణి పాపారావు..

హైదరాబాద్‌( ఆదాబ్‌ హైదరాబాద్‌ ) : ఆయన పేరు పాపారావు అందరూ ముద్దుగా పాపాల పాపారావు అని పిలుచుకుంటారు.. ఇబ్బడి ముబ్బడిగా వసూళ్లు చేయడం ఇతగాడి స్పెషాలిటీ.. అప్పట్లో కేసీఆర్‌ రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పడు. ఈయన గారు రవాణా శాఖలో నియమింపబడి.. ఏకంగా కమిషనర్‌ స్థాయికి ఎదిగాడు.. నిజానికి కమిషనర్‌ గా కొనసాగే అర్హత ఈయనకు లేదు.. కేవలం వెలమ కులస్తుడు కావడం.. దానికి తోడు కేసీఆర్‌ కి దగ్గర బంధువు కావడం ఒక్కటే ఈయన అర్హత.. కేసీఆర్‌ కనుసన్నలలో మెలుగుతూ అందినకాడికి దోచుకోవడమే ఈయన కర్తవ్యం.. లక్షలకు లక్షలు లంచాల రూపంలో దోచుకోవడం.. ఆ పాపపు సొమ్మును అధినేత కేసీఆర్‌ కి ముట్టజెప్పడం.. ఇదే పాపారావు దినచర్య.. ఈయన వేధింపులకు గురైన వారు ఎందరో ఉన్నారు. ఒక్కోసారి జలగ సైతం కొంత రక్తం పీల్చాక వదిలేస్తుంది.. కానీ పాపారావు మాత్రం జనాల రక్తం పేల్చడంలో అందెవేసిన చెయ్యి.. ఈయన ధనదాహానికి అంతు అనేది ఉండదు.. ఇరవై నాలుగు సెవన్‌ అదేపనిమీద ఉంటాడు..

- Advertisement -

ఇప్పుడు ప్రభుత్వం మారింది.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.. డైనమిక్‌ లీడర్‌ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ చూశాం.. అందులో రేవంత్‌ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాన్ని చూశాం.. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ఆయన దృష్టి సారించడం చూశాం.. వివిధ ప్రక్రియలపై గత ప్రభుత్వ పాలనపై శ్వేత పత్రాలు విడుదల చేయడం చూసాం.. విద్యుత్‌ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా చూసాం.. దీన్ని బట్టే అర్ధం అవుతోంది.. రేవంత్‌ రెడ్డి ఎవరినీ వదలదలుచుకోలేదని.. అవినీతి సామ్రాట్టుల సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడని.. అయితే ఇప్పుడు.. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖపై కూడా రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు..

అసలు విషయానికి వస్తే …
కేసీఆర్‌ ప్రభుత్వంలో అత్యంత అవినీతి రారాజుగా పేరుతెచ్చుకున్న డీటీసీ పాపారావు రవాణా శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ను కాకా పట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.. అందులో భాగంగానే ఈ అక్రమ ప్రమోషన్ల డీటీసీ పుష్పగుచ్ఛాల రాజకీయం షురూ చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఈ ప్రభుత్వం లోనూ తనదే హవా అన్నట్లు కనికట్టు చేస్తూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు..

కాగా తనలాగే మరో ఇద్దరు అక్రమ ప్రమోషన్ల డీటీసీలతో కలిసి.. మంత్రి పొన్నం వద్దకు తన సామాజికవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేతో ఇప్పటికే భేటీ కూడా అయ్యారు.. ఇక ముందు కూడా రవాణాశాఖలో తన అక్రమ పెత్తనాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు సదరు ‘‘పాపా’’ల రాయుడు.. రాష్ట్ర రవాణశాఖలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూనే.. గత ప్రభుత్వ పెద్దలు తనకు బాగా దగ్గరి వారు అని ప్రచారం చేసుకొని తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అక్రమ ప్రమోషన్ల పాపాల భైరవుడు.. ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నట్లు తెలుస్తుంది… బి ఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా మనదే.. మనం ఎంత చెపితే అంత నమ్మబలుకుతున్న పాపారావు పాపాల పుట్ట పగిలే తరుణం దగ్గర పడిరది.. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పోయిన ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు అక్రమ ప్రమోషన్లు ఇప్పించిన.. ‘‘పాపా’’లరాయుడి అవినీతి చిట్టా సేకరించేందుకు.. రాష్ట్ర నిఘా సంస్థ నజర్‌ వేసినట్లు తెలుస్తోంది.. రాష్ట్ర వ్యాప్తంగా నెల నెలా తనకు వస్తున్న కోట్ల రూపాయలు, గత ప్రభుత్వం పేరు చెప్పి కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరించే పనిలో నిఘా సంస్థలు సంసిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.. అంతేకాదు. ‘‘పాపా’’లరాయుడి బినామీలను సైతం గుర్తించే పనిలో నిఘా వర్గాలు ఉన్నట్లు రవాణాశాఖలో జోరుగా చర్చ సాగుతోంది.. గత కొద్దిరోజులుగా ‘ ఆదాబ్‌ ‘ ‘‘పాపా’’లరాయుడి అవినీతిపై కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖలో ‘‘పాపా’’లరాయుడి వ్యవహారం చర్చానీయాంశంగా మారిందని తెలిసింది…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు