Tuesday, May 7, 2024

కరీంనగర్‌లో తనికీలు ..

తప్పక చదవండి
  • రూ. 2.36 కోట్ల నగదు పట్టివేత
  • కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు వెల్లడి

కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమం గా డబ్బు, మద్యం, ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్‌ పోస్టు లను ఏర్పాటు, ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నామని కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు. అందులో భాగంగా సోమవారం జిల్లా లోని కరీంనగర్‌ పట్టణ డివిజన్‌ లోని టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌ హౌస్‌ వద్ద ఇన్స్పెక్టర్‌ రాంచందర్‌ రావు వాహన తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రైటర్‌ సేఫ్‌ గార్డ్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ వాన్‌ నంబర్‌ టిఎస్‌ 09 యూ డి 5198 వాహనం నందు సరైన పూర్తి ఆధారాలు లేని 2,36,48,494/- రూపాయలను (రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగువందల తొంబై నాలుగు రూపాయల) డబ్బు పట్టుకుని, ఎన్నికల నియమావళి ప్రకారంగా స్వాధీన పరుచుకున్నామని వెంటనే స్థానిక రిటర్నింగ్‌ అధికారి, ఆదాయ పన్నుశాఖ వారికీ సమాచారమందిం చామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా పట్టుబడ్డ నగదు మొత్తం 2,84,67,452/- రూపాయలలో (2 కోట్ల 84 లక్షల 67 వేల 452 రూపాయలు) అని తెలిపారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుకోవడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్‌ రాంచందర్‌ రావు, ఎస్‌ఐ చీనా నాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, జ్ఞానేశ్వర్‌, కానిస్టేబుల్‌ రవీందర్‌, మల్లయ్య లను పోలీస్‌ కమీషనర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ డి ఓ) కె.మహేశ్వర్‌, ఏసీపీ టౌన్‌ నరేందర్‌, టూ టౌన్‌ ఇన్స్పెక్టర్‌ కె.రాంచందర్‌ రావు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు