Thursday, May 2, 2024

ఉత్తరప్రదేశ్‌ చెంపదెబ్బ కేసులో సుప్రీం ఆగ్రహం

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఓ ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టిం చిన కేసులో పిల్లలకు మానసిక సలహా ఇప్పించాలనే ఉత్తర్వును ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఖాతరు చేయడంలేదని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. వీరికి ఎలా కౌన్సెలింగ్‌ చేయాలో సూచించాలని ముం బయిలోని టాటా సామాజిక శాస్త్రాల సంస్థ (టిస్‌)ను కోరింది. దీనికోసం రాష్ట్రంలోని ప్రముఖ మా నసిక నిపుణులను ఎంపిక చేసే బాధ్యతను టిస్‌కే అప్పగించి, ఆ సంస్థ పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ జరపాలని ఆదేశించింది. దీనికి కావలసిన వసతులను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం టిస్‌కు అందించి తన నివేదికను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబరు 11నాడు సమర్పించాలని నిర్దేశిరచింది. కోర్టు అభిశంసనకు గురికాకుండా ఉండాలంటే ఆ రోజు విచారణలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వర్చువల్‌గా పాల్గొనాలని పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖుబ్బాపూర్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఒక ముస్లిం బాలుడిని ఉపాధ్యాయని సహాధ్యాయులతో చెంప దెబ్బ కొట్టించడమే కాకుండా మతపరంగా దుర్భాషలాడిన వీడియో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు