Thursday, May 2, 2024

ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు

తప్పక చదవండి
  • ప్రలోభాలపై దృష్టి సారించాలి
  • మద్యం, నగదు పంపిణీలపై ప్రత్యేక ఫోకస్‌
  • ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
  • రాష్ట్ర ఎన్నికల నిర్వహణపై కేంద్రం సవిూక్ష
  • పలు సూచనలు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ : ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రలోభాలపై దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.మద్యం, నగదు కట్టిడిలో చివరి రెండు రోజులు కీలకమని సీఈసీ తెలిపింది. మావోయిస్టు,సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈసీఐ సూచించింది. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి, ఇతర అధికారులతో సవిూక్షించింది. ఈ కాన్ఫరెన్స్‌కు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, నోడల్‌ ఆఫీసర్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు హాజరయ్యారు. సీఈఓ వికాస్‌ రాజ్‌, ఆయన బృందం కూడా పాల్గొంది. మంగళవారం సాయంత్రం ప్రచార పర్వం ముగియనుండడంతో తీసుకోవాల్సిన చర్యలపై ఇసి సూచనలు చేసింది. 35వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ,3లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 13 జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. పోలింగ్‌ టైం ముగియగానే సెగ్మెంట్లు ఖాళీ చేయాలని స్థానికేత రులకు ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. 119 అసెంబ్లీ కేంద్రాలు ` 2290 అభ్యర్థులు, ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్‌ యూనిట్లు, అదనంగా మరో 14వేలు ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 30వ తేదీ పోలింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 3వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ప్రసారంపై ఎన్నికల అధికారులు నిషేధం విధించారు. వీటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌ల ప్రసారాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిలిపివేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా ఎస్‌ఎంఎస్‌లు పంపరాదని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి భారత శిక్షాస్మతి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడిరచారు. మరోవైపు పోలింగ్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ మొదలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కోలాహలం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్‌ స్లిప్పుల పంపిణీ కొనసాగుతోంది. ఓటర్‌ స్లిప్పుతోపాటు ఓటరు గుర్తింపు కార్డ్‌ తీసుకెళ్లి ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే కారణాలు ఏమైనా కొంతమంది వద్ద ఓటరు ఐడీ కార్డులు లేకపోవచ్చు. అలాంటి వారు కూడా నిస్సందేహంగా ఓటు వేయవచ్చు. అయితే పోలింగ్‌ బూత్‌కు ప్రభుత్వ ఆమోదం ఉన్న 14గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి దానిని పోలింగ్‌ బూత్‌కి తీసుకెళ్తే సరిపోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. నవంబర్‌ 30న 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ తేదీ సవిూపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల ఉత్కంఠ పెరుగుతోంది. తమ ప్రాంతంలో వీలైనంత ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనేలా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. 2018లో మొత్తం 2,56,94,443 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,04,70,749 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం రాష్ట్రంలో 79.7 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2018లో అత్యధిక, అత్యల్ప ఓటింగ్‌ జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలు ప్రాధాన్యం సంతరించుకుంది. 2018లో తెలంగాణలోని పాలేరు అసెంబ్లీ స్థానంలో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది. ఇక్కడ ఓటింగ్‌ శాతం 92.1 శాతం నమోదైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,08,659 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మొత్తం 1,92,164 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. 2018లో మధిర అసెంబ్లీ స్థానంలో 92.0 శాతం ఓటింగ్‌ జరిగింది. ఇక్కడ మొత్తం 2,03,240 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,86,943 మంది ఓటు వేశారు. అలేర్‌ నియోజకవర్గంలో 91.5 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం 2,09,345 మంది ఓటర్లు ఉండగా.. 1,91,481 మంది తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. మలక్‌పేట అసెంబ్లీ స్థానంలో 42.4 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇక్కడ నమోదైన ఓటర్ల సంఖ్య 2,93,487 కాగా.. కేవలం 1,24,315 మంది మాత్రమే ఓటు వేశారు. యాకుత్‌పురా అసెంబ్లీ స్థానంలో 42.5 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ స్థానంలో నమోదైన ఓటర్లు 3,33,577 కాగా.. కేవలం 1,41,839 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నాంపల్లి నియోజకవర్గంలో 45.5 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 3,03,521 కాగా, 1,37,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు