Sunday, April 28, 2024

యూఎస్‌ ఫెడ్‌ ఎఫెక్ట్‌..

తప్పక చదవండి
  • చివర్లో స్వల్ప లాభాలతో స్టాక్స్‌ ముగింపు

వడ్డీరేట్లపై యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పం దించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడిరగ్‌ ముగింపు సమ యానికి కొన్ని నిమిషాల ముంగిట స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 34 పాయింట్ల లబ్ధితో 69,585 పాయింట్ల వద్ద స్థిర పడిరది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకుని 20,926 పాయింట్ల వద్ద స్థిర పడిరది. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌-30లో ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ ఫార్మా, ఎస్బీఐ, టైటాన్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఐటీసీ, మారుతి సుజుకి షేర్లు 3.6 శాతం వరకు పుంజుకున్నాయి. మరో వైపు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్సీఎల్‌ టెక్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర స్టాక్స్‌ రెండు శాతం వరకూ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 1.06 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 0.73శాతం లబ్ధిపొందాయి. ఎన్‌ఎస్‌ఈసూచీనిఫ్టీలో ఐటీఇండెక్స్‌1.3శాతం,ప్రైవేట్‌బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 0.07 నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు ఒక శాతం వరకు లాభంతో ముగిశాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు