Sunday, May 12, 2024

రూ. 49.20 లక్షల డ్రీమ్‌ ప్యాకేజ్‌తో చార్టర్డ్‌ అకౌంటెంట్‌కు క్రేజీ ఆఫర్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల నిర్వహించిన 58వ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో దేశీ నియామకాలకు రూ. 23.7 లక్షల అత్యధిక వేతన ప్యాకేజ్‌ ఆఫర్‌ చేశారు. ఇక విదేశీ పోస్టింగ్స్‌కు అత్యధి కంగా రూ. 49.20 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌ చేశారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో సగటు వార్షిక వేతనం రూ. 11.17 లక్షలుగా నిలిచింది. మొత్తం 169 కంపెనీలు 2713 జాబ్‌లు ఆఫర్‌ చేయగా ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న ప్రొఫెషనల్స్‌ 2105 ఆఫర్లను అంగీకరించారు. యాక్సెంచర్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, భారత్‌ పెట్రోలియం కార్ప్‌, భారతి ఎయిర్‌టెల్‌, గెయిల్‌, ఇన్ఫోసిస్‌, హీరో మోటో కార్ప్‌, హెచ్‌సీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, కేపీఎంజీ గ్లోబల్‌ సర్వీసెస్‌, ఎల్‌అండ్‌టీ, ఎల్‌ఐసీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి కంపెనీలు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్‌ చేసుకున్నాయి. కాగా, కఠిన పరీక్షలు, విద్యా ప్రమాణాలతో ఐసీఏఐ చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత అకౌంటింగ్‌ సంస్ధగా పేరొందిందని ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇక ఎకానమీ ఎదుగుదలతో చార్టర్డ్‌ అకౌంటెంట్‌లకు భారీ వేతన ప్యాకేజ్‌లతో క్రేజీ ఆఫర్లు లభిస్తున్నాయనేందుకు ఈ ప్లేస్‌మెంట్స్‌ సానుకూల సంకేతాలు పంపాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు