Thursday, May 2, 2024

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ఏబీవీపీ

తప్పక చదవండి

హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు చేగుంట మండల కేంద్రంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. బస్సులు సమయానికి రాక విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా సమయాన్ని మించి ప్రయాణం చేస్తున్నారని దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆరోపించారు. విద్యార్థులు కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లడానికి దాదాపు రాత్రి 9 గంటల సమయం పడుతుందని .. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక బస్సులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరుపున డిమాండ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సాయి వంశీ భరత్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు