Thursday, May 2, 2024

సోషల్‌ మీడియా వక్రబుద్ధి..!

తప్పక చదవండి

ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల విప్లవం పెల్లుబుకు తున్నది. ఇంటర్నెట్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడంపాటు చవకగా వివిధ ప్యాకేజీలు లభిస్తుండడంతో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతున్నది.సోషల్‌ మీడియా ఉపయోగించే వారి సంఖ్య ఉహించని విధంగా పెరిగిపోతున్నది.ఇదే అదనుగా ఎన్నికలు దగ్గర పడుతుంటే రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఒకరు సోషల్‌ మీడియా ఎత్తులతో, వ్యూహకర్తల జిత్తులతో అయోమయం సృష్టి స్తున్నారు. సోషల్‌ మీడియా యూనివర్సిటీ నడిపించిన బీజేపీ తెలంగాణలో వెనుకబడిరది. కాంగ్రెస్‌ మాత్రం ఊపుమీద ఉంది. రాష్ట్రంలో గెలుపు,ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అను గుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, సోషల్‌ మీడియాలో కథనాన్ని అల్లుతున్నారు.అదే పనిగా ఆ ఫేక్‌ వార్తా కథనంపై రోజంతా చర్చ, మర్నాటికి మరో కొత్త పోస్టు, దీనికి కారణం స్మార్ట్‌ఫోన్‌ ప్రభావం పెరిగిపోవడంతో.. సోషల్‌ మీడియాలో వచ్చిందే నిజమైన వార్త అనే దుస్థితికి చేరుకున్నాం. అగ్నికి ఆజ్యం పోసే వార్తలను గుడ్డిగా షేర్‌ చేస్తున్నాం. ‘ఫార్వర్డ్‌ మెనీ టైమ్స్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తున్నా..ఫేక్‌ క్రైమ్‌ న్యూస్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఓ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నాడనీ, మనం ఆ వలలో పడకూ డదనీ.. తెలుసుకోలేక పోతున్నాం.నకిలీ వార్తల వెనుక కుట్రలను అర్థం చేసుకొని ఇది నిజమా? కాదా?’ అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇతరులకు షేర్‌ చేయడం ఉత్తమం అనేదీ మర్చిపోయి ఫేక్‌ మీడియా కథనాలకు ప్రోత్సహించే స్థాయికి దిగజారింది. మారిన పరిస్థితుల్లో మీడియా కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరిపోయింది.అధికారం మార్పిడి కోసం ఫేక్‌ మీడియా ద్వారా ప్రజల మనుస్సు దోచుకునే ప్రయత్నం విచ్చల విడిగా చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు చాలా టైట్‌ ఫైట్‌ నడుస్తున్నదని,ఎందుకయ్యా అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని,కేసీఆర్‌ చరిష్మా తగ్గిందని,అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉందని అందుకే మార్పు కోరుకుంటాన్నారని, ప్రజ లంతా గంప గుత్తగా తిరుగుబాటు చేస్తున్నారని సోషల్‌ మీడియాలో వెల్లగక్కు తున్నారు.నిజం గడపదాటేలోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుం దంటే గిదే కావొచ్చు.స్వార్థంతో ఊహలపల్లకీలో అబద్దాలను ఊరేగించి ప్రత్యర్థులను బతికి బట్టకట్టలేని దుస్థితికి తేవడంలో ప్రింట్‌ మీడియా గానీ,ఎలక్ట్రానిక్‌ మీడియా గానీ తమ బాధ్యతను మరచి అక్రమాలకు ఆజ్యం పోస్తుంది. మీడియా సంస్థలు రాజ కీయ అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరు.ఇష్టంతో చేయడం వేరు- భయంతో చేయడం వేరు. భయంపెట్టడం వల్ల తాత్కాలిక ప్రయోజనం పొందవచ్చునేమో గాని శాశ్వత ప్రయో జనం దక్కదు. ఇప్పుడు మీడియా కూడా తన మనుగడ ,విశ్వసనీ యత కోసం స్వంతంత్రంగా పనిచేయవలసిన అవసరం ఏర్పడు తోంది. లేని పక్షంలో సోషల్‌ మీడియా ధాటికి ప్రధాన మీడియా కుప్పకూలే రోజులు ఎంతో దూరంలో లేవు.ఈ సమా జంలో అబ ద్దాన్ని కాలరాసి నిజాన్ని నిలబెట్టే శక్తి ఎక్కడైనా ఉందం టే అది.. మనలోనే ఉంది. మనం ధర్మాన్ని కాపాడకపోతే, మనం నిజాన్ని నిలబెట్టకపోతే భావితరమే అబద్ధమైపోతుంది. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంలో చేసిన అభివృద్ధి చూపెట్టకుండా ప్రతి కూల అంశాలను సోషల్‌ మీడియా పదేపదే ప్రాపగండా చేయడం ప్రతిపక్షాల వ్యూహకర్తల సృష్టేనని ప్రజలు గుర్తించడం బీఆర్‌ ఎస్‌కు కల్సి వస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాకు ఉన్న స్వేఛ్చ ఏపాటిదో తేలిపోయింది. ఏ ఒక్క మీడియా సంస్థ కూడా కేంద్ర పెద్దలను ఎదిరించి నిలబడ లేని పరిస్థితి.జాతీయ మీడియాను అదుపులోకి తెచ్చుకున్న పాలక పెద్దలు ప్రాంతీయ మీడియాపై కూడా దృష్టి సారించి సఫలీకృతం అయ్యారు.దింతో ఒకటి అరా మీడియా సంస్థలు మినహా మిగ తావన్నీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపలేని నిస్సహాయక స్థితికి చేరు కున్నాయి.ఈ దుస్థితికి చేరుకోవ డానికి నిర్వహణ వ్యయం విపరీ తంగా పెరిగిపోవడం ప్రధాన కారణం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగులు,స్వీయ ప్రయోజ నాలు ఉన్న వారు మీడియాలోకి జొరబడి అధికార పార్టీకి వ్యతిరే కంగా ఉన్నది లేనట్లుగా,లేనిది ఉన్నట్లుగా కథనాలు సృష్టించి పబ్బం గడుపుకుం టున్నారు.ఇంతెందుకు సీమాంధ్ర మీడియా థాట్‌ పోలీసింగ్‌ అంతా ఇంతా కాదు.తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక్క రోజు సంపాదకీయం పేజీలో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవస రమో, ఉద్యమం పట్ల విషం చిమ్మిందే తప్ప ఎన్నడూ సహకరిం చలేదు. అదే కోడి కత్తి వ్యవహారానికి ఇచ్చిన ప్రచారం,సెలబ్రెటీల శోభనానికి ఇచ్చిన ప్రచారం మాములుగా ఉండదు.ఫేక్‌ మీడియా తో పాటు ముఖ్యంగా కొన్ని మీడియా హౌస్‌ ల ధోరణి మరీ ప్రమా దకరం. అది ఇప్పటి నుంచి కాదు.జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు దశాబ్దాలుగా ఆ పత్రి కలూ, ఆ చానళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం అర్థం కాదు. అంచనాలు, పరికల్పనలు,భావనలు ..అన్ని వేళలా నిజమ వవు, కొన్ని సార్లు పాక్షికంగా సంబర పెట్టొచ్చేమోగాని,ఎన్నికల వేళా ఓటరు నిర్ణయంపై సోషల్‌ మీడియా ప్రభావం కాసింతే.. సోషల్‌ మీడియా సమాచారాన్ని నమ్మి ఓటు వేస్తాడనుకుంటే మూర్కత్వమే. నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు