Friday, May 3, 2024

కబ్జాల పెద్దికి ఓటమి తప్పదా..?

తప్పక చదవండి
  • అనుచర వర్గం నిర్వాకంతో సుదర్శన్ రెడ్డి కి నర్సంపేట లో రివర్స్..
  • సొంత మండలంలో భారీగా వ్యతిరేకత..
  • ఎంపిపి భర్త ప్రభుత్వ దవాఖాన పట్టా చేసుకున్నా పట్టించుకోని ఎమ్మెల్యే..
  • మళ్లీ గెలిస్తే వీరి ఆగడాలకు అడ్డు అదుపు ఉండదంటున్న స్థానిక ప్రజలు..
  • అధికారులను అడ్డుగా పెట్టుకుని నియంతలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు..
  • క్యాడర్ పట్టుజారిపోకుండా కాళ్లబేరానికొస్తున్న లీడర్లు..
  • డబ్బులకు కాదు ఆత్మగౌరవానికి పట్టం కడతామంటు ప్రతిన బూనుతున్న ప్రజలు..

ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నర్సంపేట కారు పార్టీ లీడర్లలో గుబులు రేగుతోంది.. నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత మండలంతో పాటుగా అన్ని మండలాలలో.. మరీ ముఖ్యంగా నర్సంపేట పట్టణంలో పెద్దికి భారీ వ్యతిరేకత కొనసాగుతోంది.. ఐదు సంవత్సరాల కాలంలో కారు పార్టీ లీడర్ల భూ అక్రమణలు.. అక్రమ కేసులతో ప్రజలు సతమతమవుతున్నారు… పోలీసులను, రెవెన్యూ అధికారులను వారి గుపిట్లో పెట్టుకుని వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య ప్రజలకు విసుగు తెప్పించునట్లు తెలుస్తోంది..

వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజీక వర్గంలో ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చి పెద్ద పొరబాటు చేశామని.. మరోసారి అవకాశం ఇచ్చి తమ గొయ్యి తాము తవ్వుకోలేము అనే ఆలోచనలో నర్సంపేట నియోజక వర్గ ప్రజలు ఉన్నట్లుగా సర్వేల ద్వారా వెల్లడవుతోంది.. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత మండలం నల్లబెల్లిలో కారు పార్టీ లీడర్ల కబ్జాలు పలుమార్లు వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననూ పెద్ది సుదర్శన్ రెడ్డి చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో.. ఆ అక్రమాలలో పెద్ద సుదర్శన్ రెడ్డి భాగస్వామిగా ఉన్నట్లుగా అర్థమవుతుంది.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టా చేసుకొని.. నిత్యం ఎమ్మెల్యే వెనుక తిరుగుతున్న ఎంపిపీ భర్త ఉడుగుల ప్రభాకర్ పై కనీస చర్యలు తీసుకోకుండా.. పైగా తనవెంట తిప్పుకోవడం.. ప్రభుత్వ దవాఖానకు చెందిన భూమికి అక్రమంగా రైతుబంధు కాజేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పలు అనుమానాలకు తావిస్తుంది.. దీనికి తోడు సెకండ్ కేడర్ ని పట్టించుకోకుండా.. ఉద్యమకారులను విస్మరించడంతో వారు పార్టీలో వున్నా ఆంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం.. పెద్ది సామాన్య ప్రజలను చిన్నచూపు చూడడంతో పాటు తాను ప్రజలతో వ్యవహరిస్తున్న శైలి అహంకారపూరితంగా నడవడం.. తాను చూసే విధానం పొగరుగా ఉండడంతో పలు సర్వే సంస్థల ద్వారా తెలుసుకున్న అధిష్టానం తన వ్యవహరి శైలి మార్చుకోవాలని మందలిచ్చినట్లుగా సమాచారం… ఇది కప్పి పుచ్చుకోవడానికి వివిధ సభలలో తాను ఉద్యమ సమయంలో కంటికి బలమైన గాయం తగిలిందని, తన కన్ను సరిగా అగుపడదని ప్రజల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం చేసిన అది అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు… సామాన్య ప్రజలతో పాటు కారు పార్టీ లీడర్లు, ఉద్యమకారులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బ్రతిమిలాడి, బెదిరించి తిరిగి మళ్లీ పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమంలో విఫలమవుతున్నారు.. మరి కొంతమంది క్యాడర్ ని పార్టీ మారకుండా చూసుకొని ప్యాకేజీలు గుప్పిస్తున్నరట.. ఇదంతా ఇలా ఉంటే బలవంతపు వివాహాలు నిలువలేవు అనే సామెత ప్రకారం బలవంతపు బెదిరింపులతో ఓట్లు పొందలేరని.. పెద్ది సుదర్శన్ యొక్క అహంకారానికి బుద్ధి చెప్పడం తప్పదని.. సర్వేల ద్వారా విశ్లేషకులు గుసగుసలాడుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంట తిగుతున్న నాయకుడికి ఇంటి నిర్మాణాలు లేకుండా నెంబర్లు ఎలా వచ్చాయి..? ట్యాక్స్ ఎలా చెల్లించారు..? టెండర్ లేకుండా తన అనుచర వర్గానికి కాంట్రాక్టులు కట్టబెట్టిన వ్యవహారంపై, 2014 ఎలక్షన్ అఫడవిట్ లో చూపించిన దానికి బిన్నంగా 2023 ఎలక్షన్ అఫడవిట్ లో చూపిన అక్రమాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ఆదాబ్ హైదరాబాద్’ .. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు