Monday, April 29, 2024

బజాజ్‌ ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ షాక్‌..

తప్పక చదవండి
  • బజాజ్‌ లెండింగ్‌ రుణాలు ఆపేయాలని సూచన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజాజ్‌ ఫైనాన్స్‌కు షాక్‌ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెండు లెండింగ్ ప్రొడక్టులపై లోన్లు ఇవ్వొద్దని బుధవారం ఆదేశించింది. బజాజ్‌ లెండింగ్‌ ఉత్పత్తులైన కార్డ్‌ల కింద లోన్ల జారీని వెంటనే నిలిపివేయాలని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్‌ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. బజాజ్‌ కంపెనీ ఆర్‌బీఐ జారీ చేసిన డిజిటల్‌ లోన్‌ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది. ఈ రెండు ప్రొడక్టుల గురించి కస్టమర్లకు బజాజ్ ఫైనాన్స్ వాస్తవ ప్రకటనలను జారీ చేయలేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రకటలు విడుదల చేయకపోవడం, కీలక లోపాలు రెండు ప్రొడక్టుల కింద జరిగాయని.. ఇలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోక తప్పలేదని పేర్కొంది. కంపెనీ ఆమోదించిన ఇతర డిజిటల్‌ రుణాలకు సంబంధించి వాస్తవ ప్రకటనలు జారీ చేసినట్లు తెలిపింది. ఆర్‌బీఐ పేర్కొన్న లోపాలను సరిదిద్దిన తర్వాత సంతృప్తి పొందితే పరిమితులను సమీక్షిస్తామని స్పష్టం చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు