- కొత్త రూల్స్.. ఛానల్ లో ఏఐ కంటెంట్ ఉంటే…
- కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన యూట్యూబ్..!
- పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక..!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఏఐ పాపులారిటీ భారీగా పెరిగింది. అతి శక్తివంతమైన ఏఐ చాట్‌బాట్‌లు, ఇమేజ్ మరియు వీడియో జనరేటర్లు మరియు ఇతర ఏఐ టూల్స్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. దీంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. ప్రస్తుతం పలు చేదు అనుభావాలను సైతం మిగులుస్తున్నది. ఈ టెక్నాలజీని మంచి ప్రయోజనాల కోసం వినియోగిస్తే అత్యుత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా.. చాలా మంది తప్పుడు ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఏఐ సహాయంతో ప్రతి రోజూ పెద్ద సంఖ్య నకిలీ కంటెంట్‌ను సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతున్నది. అయితే, దీన్ని ఆపేందుకు యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏఐ కంటెంట్‌కు తమ ప్లాట్‌ఫామ్‌లో చోటు లేదని యూట్యూబ్ స్పష్టం చేసింది. ఏఐ సహాయంతో రూపొందించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేసిన సందర్భంలో తొలగించడంతో పాటు వాటిని లేబుల్ చేయనున్నది. కంటెంట్ క్రియేటర్లు ఏఐ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన సందర్భంగా ఏఐ టెక్నాలజీ ద్వారా కంటెంట్‌ను రూపొందించినట్లుగా ప్రకటించాల్సి ఉంటుందని, లేకపోతే ఆయా వీడియోలను తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యూట్యూబ్ బ్లాగ్‌లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. ఎవరైనా యూజర్లు కంటెంట్‌నూ వీక్షిస్తున్న సందర్భంలో ఈ కంటెంట్‌ను ఏఐ సహాయంతో సృష్టించినట్లు చెబుతుందని పేర్కొంది.
డిస్క్రిప్షన్‌లో ఏఐ లేబుల్‌కు ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను పాటించని కంటెంట్ క్రియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంటెంట్‌ను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్‌కు సంబంధించి మానిటైజేషన్ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల యూట్యూబ్ ప్రకటనల బ్లాకర్స్‌ను బ్లాక్ చేసింది. బ్లాకర్ ద్వారా ఎవరైనా యాడ్స్ బ్లాక్ చేసి వీడియోలు చూస్తే మూడుసార్లు వార్నింగ్ ఇస్తామని.. మూడు వీడియోలు చూసిన తర్వాత సంబంధిత అకౌంట్‌ను బ్లాక్ చేయనున్నట్లు యూట్యూబ్ పేర్కొంది. అయితే, యాడ్ బ్లాకర్ ట్రాకింగ్ పేరుతో యూట్యూబ్ యూజర్లపై గూఢచర్యానికి పాల్పడుతుందని ఆరోపణలు వచ్చాయి.