Monday, April 29, 2024

అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీలో మార్పు చేసిన ఆర్‌బీఐ..

తప్పక చదవండి
  • అభ్యర్థులు అలెర్ట్ గా ఉండాలని సూచన..

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ సంబంధించి పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ఆర్‌బీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మొద‌ట అక్టోబర్‌ 21న ప్రిలిమ్స్‌, డిసెంబర్‌ 2న మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అయితే ఈ తేదీల‌ను తాజాగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇక కొత్త తేదీల ప్రకారం.. ప్రిలిమ్స్‌ పరీక్షను నవంబర్‌ 18, 19 తేదీల్లో, మెయిన్స్‌ పరీక్షను డిసెంబర్‌ 31న నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆర్‌బీఐ 450 ఉద్యోగాలు భర్తీ చేయ‌నుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభంకాగా.. అక్టోబ‌ర్ 04 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు