Wednesday, April 24, 2024

వరల్డ్ కప్ స్పెషల్ ఎడిషన్ వాషింగ్ మెషీన్‌ను విడుదల చేసిన థామ్సన్

తప్పక చదవండి
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ( 8 – 15వ అక్టోబర్, 2023) లో అన్ని ఉత్పత్తుల
    కేటగిరీలపై భారీ పెద్ద తగ్గింపులను అందిస్తోన్న థామ్సన్ హోమ్స్..
  • థామ్సన్ టీవీపై భారీ ఆఫర్‌లు ప్రారంభ ధర రూ. 6,299 మాత్రమే..
  • వాషింగ్ మెషీన్లు రూ. 5,057 మాత్రమే..

హైదరాబాద్ : ఫ్రెంచ్ కన్స్యూమర్ ఉపకరణాల బ్రాండ్ థామ్సన్ 2023 అక్టోబర్ 8 నుండి 15 వరకు జరిగే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్‌లతో సహా అన్ని ఉత్పత్తులపై భారీ రాయితీలను ప్రకటించింది. థామ్సన్ ప్రపంచ కప్ స్పెషల్ ఎడిషన్ టీవీ 43 ఆల్ఫా 005 బీ.ఎల్. రూ. 14,999 బ్లూ బెజెల్స్‌తో పాటు కొత్త సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మోడల్ రూ. 8,399 వైబ్రెంట్ బ్లూ, ఆరెంజ్ కలర్ టోన్‌లలో, టర్బో ఎక్సెల్ టెక్నాలజీతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అతి తక్కువ ప్రారంభ ధర రూ. 8,888/- తో అందిస్తుంది. అదేవిధంగా థామ్సన్ వాషింగ్ మెషీన్‌లు 7 కిలోల మోడల్ ప్రారంభ ధర రూ. 5057/- , దీని కేటగిరీలో అత్యంత ‘ప్రీమియం సరసమైన’ ఉత్పత్తి గా ఇది నిలుస్తుంది. ఈ తగ్గింపులు పండుగ సీజన్ సేల్‌ 8 రోజులలో అందుబాటులో ఉంటాయి. థామ్సన్ ఇటీవల భారతీయ వినియోగదారుల కోసం దాని క్యూ లెడ్, ఓత్ ప్రో మ్యాక్స్, ఎఫ్.ఏ. సిరీస్ టీవీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త 43 అంగుళాల క్యూ లెడ్, రియల్ టెక్ ప్రాసెసర్‌తో 43 అంగుళాల ఎఫ్.ఏ. సిరీస్ టీవీలు, 4కె డిస్‌ప్లేతో 55 అంగుళాల గూగుల్ టీవీ, సరికొత్త శ్రేణి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లు వున్నాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు