Wednesday, September 11, 2024
spot_img

రైతులకు ఎరువులు సిద్దం చేయండి

తప్పక చదవండి
  • పంటలకు అనుగుణంగా స్టాక్‌ చేర్చాలి
  • గ్రామస్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి
  • అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్‌ : రైతులకు కావలసినటువంటి అన్ని రకాల ఎరువులను సిద్ధంగా పెట్టడమే కాకుండా, గ్రామస్థాయి వరకు చేర్చే ప్రణాలికతో సంసిద్దంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో, అగ్రికల్చర్‌ సంచాలకులు బి. గోపి, ఏం.డి మార్క్‌ఫెడ్‌ సి.హెచ్‌. సత్యనారాయణ, ఏం.డి ఆగ్రోస్‌ కె .రాములు, ఏం.డి టెస్‌ కాబ్‌ ఎన్‌. మురిలిధర్‌ , ఇతర డిపార్టుమెంట్‌ అధికారులు ఎరువుల కంపెనీలతో యాసంగి ఎరువుల లభ్యత మరియు సరఫరా పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నోడల్‌ ఏజెన్సీ, ఎరువుల కంపెనీల తో చర్చించి సిద్ధం చేయమని ఆదేశించారు. అంచనా ప్రకారం రైతుల అవసరాల మేరకు, ఎరువులను ముందస్తుగానే గ్రామ స్థాయి వరకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మార్క్‌ ఫెడ్‌ , వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ నెల 9వ తేదీ నుండి లారీ డ్రైవర్ల సమ్మె కారణంగా నిర్మల్‌ జిల్లాలోని రెండు ప్రాంతాలలో ఎరువుల సరఫరాలో జాప్యం పై స్పందిస్తూ జిల్లా అధికారులను సకాలంలో కావలిసిన ఎరువులను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ప్రాంతాల వారీగా, పంటల వారీగా, పంట దశల వారీగా ఎరువుల అవసరాలను ముందస్తుగానే గుర్తించి, అవసరం మేరకు ఎరువులను అంచనా వేసుకుని గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో వుంచవలసిందిగా అధికారులను నిర్దేశించారు. దీనిపై రైతులు ఎటువంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని కావాల్సిన ఎరువుల నిల్వలు ఉన్నయని తెలిపారు. పాత రుణాల బకాయిల గురించి సమీక్షించారు, ఈ సమీక్షలో మొండి బకాయిలు మరియు నాన్‌ అగ్రికల్చర్‌ రుణాలను తీర్చని వారి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. నిజామాబాద్‌ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతి పత్రాలు పై సానుకులముగా స్పందించి ఫాక్స్‌ లో నిభందనలకు విరుధముగా తీసుకున్న రుణాల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏం.డి టెస్‌ కాబ్‌ ని ఆదేశించారు. అలాగే ఫాక్స్‌ సంఘాలని బలోపేతం చేయాలని సూచించారు. వారం రోజులలో రుణాలను తీర్చనీ వారి పై, రుణాల రికవరీ చేయని అధికారుల పై కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు