Monday, April 29, 2024

ఎన్నికల ప్రచారంలో ప్రజలను సరుకులుగా ఉపయోగించుకుంటున్న రాజకీయ పార్టీలు..!

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలో శాశనసభ ఎన్నికలతో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార అవసర నిమిత్తం ప్రజలను ఉదయం నిద్ర లేచిన నుండి రాత్రి సమయం వరకు రోడ్లపై తిప్పుతూ వారి ప్రచారానికి ప్రజలను ఉపయోగించుకుంటున్నారు.పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో ఎన్నికలు కీలకమే ప్రచారం కూడా కీలకమైన విషయమే కానీ ఎన్నికల ప్రచార సమయంలో రాజ్యం ప్రజలనూ ప్రభుత్వ ఉద్యోగస్తులనూ కళాకారులనూ రోడ్లపైన తిప్పుతున్న రాజకీయ నాయకులు ఎన్నికల తర్వాత ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరసనలు తెలియజేస్తే వారికి లభించే బహుమానాలు “లాటీ చార్జీలు,కేసులు,జైలు”.రాజకీయ పార్టీల ఎన్నికల సమయంలో సౌండ్ పొల్యూషన్ ఎంత ఉన్నా ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత డీజే బాక్సుల సౌండ్ వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని కారణం చూపుతూ సౌండ్ బాక్సులు లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం.ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులను వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్న రాజ్యం ప్రభుత్వ ఉద్యోగస్తులకు చట్టపరంగా వారికి రావాల్సిన “డి,ఎ”ల గురించి “పిఆర్సీ”ల గురించి ప్రమోషన్ల గురించి నిరసనలు తెలిపితే వారికి దక్కేది లాటి చార్జీలు.ఈరోజు రాజకీయ పార్టీలకు కళాకారుల “ఆటలు-పాటలు”కావాలి,ప్రజలు కావాలి, ప్రజాబలం కావాలి కానీ ఎన్నికల తర్వాత కళాకారులు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపే హక్కు లేదు.లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్లపైకొస్తే “లా అండ్ ఆర్డర్”కు విగాతం కల్గినట్లు ప్రభుత్వాలకు కన్పిస్తుంది.కాంటాక్ట్ ఉద్యోగస్తులు వారిని రెగ్యులర్ చేయాలని రోడ్లపైకొచ్చినా,పర్మనెంట్ ఉద్యోగస్తులు చట్టపరంగా ప్రభుత్వం నుండి వారికి చెందవలసిన హక్కుల కోసం శాంతి ప్రదర్శనలు చేసినా రెక్కాడితే గానీ డొక్క నిండని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గాంధీ మార్గంలో గోస వెల్లడించినా అన్నింటినీ సమాధానం ఒక్కటే “లాటీచార్జీలు- అక్రమ అరెస్టులు”.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే హామీలపై ప్రజాస్వామ్య బద్దంగా కట్టుబడి ఉండే చట్టపరమైన కఠిన నిబంధనలు రాజకీయ నాయకులపై అమలు చేసే పరిస్థితులు ఉండాలి అలాంటి కఠినమైన నిభందనలు లేకపోతే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల సాద్యం కానీ హామీలు ఇచ్చే అవకాశాలు ఈ సమాజంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.స్థానిక సంస్థల స్థాయి నుండి శాసనసభ,పార్లమెంటరీ స్థాయి వరకు ” రైట్ టూ రికాల్” వ్యవస్థ చట్టబద్ధంగా అమలు జరిపే పరిస్థితులు నేటి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో ఉండవలసిన అవసరం ఎంతో ఉన్నది. ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలకు నిరసనలు తెలిపే హక్కులు లేకుండా పోయింది ఎన్నికల ప్రచార సమయాలలో తప్ప.

గుండమల్ల సత్యనారాయణ
9505998838

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు