Friday, May 3, 2024

ఆ బస్సు ప్రమాదానికి ఓవర్‌లోడ్‌ కారణం కాదు..

తప్పక చదవండి
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

హైదరాబాద్‌ : హుజూరాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడిరగ్‌ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. బస్సులో 42 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో బస్సు 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తోందని తెలిపారు. బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే ఆపడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. బస్సులోని 42 మంది ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు మరొక బస్సులో సురక్షితంగా పంపించారని తెలిపారు. అద్దె బస్సు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ బస్సులను తనిఖీ చేస్తూ.. ఫిట్‌గా ఉంచుకోవాలని చెప్పారు. బస్సుల నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పూర్తి సామర్థ్యంతో బస్సులను నడపాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. అసలేం జరిగిందంటే.. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజురాబాద్‌-హన్మకొండ రూట్‌లో వెళ్తున్న ుూ02ఖజ 5936 నంబర్‌ గల ఆ బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో బస్సు కొద్దిగా డ్యామేజ్‌ అయింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అద్దె బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై.. బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఓవర్‌లోడ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని.. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన సజ్జనార్‌ వివరణ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు