Saturday, July 27, 2024

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ డిసెంబర్‌ 25న మనుస్మృతిని దహనం చేసిన దినం

తప్పక చదవండి
  • డాక్టర్‌ ఈదునూరి వెంకటేశ్వర్లు..

నర్సంపేట : 1927 డిసెంబర్‌ 25వ తేదీన రాత్రి 9 గంటలకు నేటికి సరిగ్గా 96 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని కొంకన్‌ ప్రాంతంలోని రాయగడ్‌ జిల్లాలోని మహద్‌ అనే చిన్న గ్రామంలో కొన్ని వేల మంది సమక్షంలో మనుధర్మశాస్త్రం ప్రతులను దహనం చేయడం జరిగింది. అంటరానితనం రూపుమాపుదాం మరియు బ్రాహ్మణీయ సంస్కృతిని పాతి పెట్టండి అనే నినాదాలతో అర అడుగు లోతులో అడుగున్నర పొడవులో తీసిన గొయ్యిలో గంధపు చెక్కలను పేర్చి బౌద్ధ సాధువుల సమక్షంలో గుజరాత్‌. మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రజల మధ్యలో మన శృతి దహన కార్యక్రమం జరిగింది. మనుధర్మ శాస్త్రంలో దళితులకు అంటరాని నిమ్న కులాలకు ఒక మనిషికి ఉండవలసిన హక్కులను పొందుపరచలేదు. దేవాలయాల ప్రవేశం లేదు. చెరువులలో ఉన్న నీటిని అన్ని కులాలతోపాటుగా దళితులు త్రాగరాదు. దళితులను విద్యకు దూరం చేయడం. సామాజిక న్యాయం లేదు. పురుషాధిక్యత సమాజంలో స్త్రీలకు ప్రాధాన్యత లేదు. సామాజిక రుగ్మతలు అయిన అస్పృశ్యత. అంటరానితనం. మరియు కుల వివక్షత ఎక్కువగా ఉండేది. భారతదేశం హిందూదేశం అయినా కూడా అన్ని వర్గాల ప్రజలకు దేవాలయ ప్రవేశం లేదు. ఇలాంటి సాంప్రదాయాలకు సజీవంగా కొనసాగిస్తూ జీవం పోస్తున్న మనస్ఫూర్తి నీ దహనం చేసి నూతన సామాజిక విప్లవానికి భారతదేశ సకల జనుల హక్కుల పునర్నిర్మాణానికి కృషి చేసిన మహానీయుడు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని తెలంగాణ గ్రాడ్యుయేషన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఈదునూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు