Tuesday, October 15, 2024
spot_img

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక

తప్పక చదవండి
  • అధ్యక్షులుగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శ్రీధర్,
  • కార్యదర్శిగా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ ఎన్నిక

ఓయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్ ఆర్ట్స్ కాలేజీ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని 24 సభ్యులతో ప్రకటించారు. యూనివర్సిటీలో వచ్చే నూతన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నినాదం, భావాజాలం, చరిత్ర మరియు అమరవీరుల త్యాగాలు తెలుసుకోవాలని చెప్పారు. దేశంలో విద్య, ప్రైవేటీకరణకు, కేంద్రీకరణకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలోని విద్యార్థుల సమస్యలు గుర్తించి పరిష్కారం మార్గం పైన సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ దేశ పాలకులు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్య రంగాన్ని కాషాయీకరణ చేయాలని మనువాదులు కుట్రపన్నారు దీనిని విద్యార్థులు తిప్పుకొట్టాలని చెప్పారు అలానే కులం,మతం,ప్రాంతం పేరుతో వివక్ష చూపరాదని పాలకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షులు సాయికిరణ్,కృష్ణ, సందీప్ యశ్వంత్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు