Sunday, April 28, 2024

నా పాదయాత్రని ఎవడు ఆపలేడు

తప్పక చదవండి
  • ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
  • రానుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం : మధుయాష్కీ గౌడ్

హయత్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోలీసుల దాడి తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదిలారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్. ‘మనకోసం-మధన్న పాదయాత్ర’ 8వ రోజు కొనసాగింది. హయత్నగర్ మథర్ డైరీ నుండి ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర అధ్యక్షులు చాడ వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నాయకులు చెమట చుక్కలు చిందించి మనం బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి, గడపగడపకు ప్రచారం చేయాలని సీపీఐ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ పాదయాత్రకు విచ్చేసిన ప్రతి ఒక్క కామ్రేడ్ కు లాల్ సలాం అంటూ స్వాగతం పలికారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఓడిపోతారనే భయంతో గులాబీ నేతలు అధికార యంత్రాంగాన్ని పావుల్లా వాడుతూ, మద్దతు దారులని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేద్దామని భావించారు. కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక బబ్బర్ షేర్ అని తెలుసుకోవాలి. న్యాయవాదిగా ప్రజలకు న్యాయం చేయడం తెలుసు బెదిరిస్తే ఎదిరించడం తెలుసు. సుధీర్ రెడ్డి.. నీ ఆటలు నా దగ్గర సాగవు. జాగ్రత్త అని హెచ్చరించారు. హయత్ నగర్ గ్రామంలో పుట్టిన నేను ఈ గడ్డ రుణం తీర్చుకొనే బృహత్తర అవకాశం లభించింది. నా కుటుంబ సభ్యులు నాకు సహకరిస్తే రేపు మీకు అన్నగా తమ్ముడిగా మీలో ఒకడిగా పరిపాలన కాకుండా సేవకుడిగా మీకు సేవలు అందిస్తా. నియోజకవర్గం నుండి గుండాలను రౌడీలను గచ్చిబౌలికి తరిమేద్దామని అన్నారు. ఎల్బీనగర్లో యువత గంజాయి కి అలవాటు పడ్డారని, వారిని సన్మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, జాబ్ క్యాలెండర్ పెట్టి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీరు నాకు అవకాశం ఇస్తే రేపు రాష్ట్రంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి స్థానంలో ఉండి అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తెచ్చి ఎల్ బీ నగర్ ను నెంబర్ వన్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని, నేను పుట్టిన గడ్డ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు