Saturday, May 11, 2024

ఆలరించిన కళా ఉత్సవం

తప్పక చదవండి

జనగామ : జిల్లా విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు విజయవంతంగా జరిగాయి, జిల్లా  కళా ఉత్సవ్ కన్వీనర్, జిల్లా విద్యాశాఖాధికారి రాము జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు. మండల స్థాయి కళా ఉత్సవ్ లో వివిధ కళారీతులలో ప్రథమ స్థానంలో నిలిచిన 120 విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 10 కళా విభాగాల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ కళా నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించి వారి ప్రతిభను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు వివిధ కళల్లో నైపుణ్యం సాధించాలని, వాటిని కూడా వృత్తిగా స్వీకరించి పైకి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కళా ఉత్సవ్ సహాయ కన్వీనర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతోమంది కళా నిష్ణాతులు ప్రముఖ వ్యక్తులయ్యారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో విద్యార్థులు సర్వతోముఖాభివృధ్ది సాధించాలని వారికి ఉద్బోధించారు. జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన 16 మంది విద్యార్థులు నేడు హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో పాల్గొంటారని  తెలిపారు. విజేతలను అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి రాము వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ముఖ్య అతిథిగా మహాత్మా హెల్పింగ్ సొసైటీ అధ్యక్షలు ఘంటా రవీందర్ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలు గా జిల్లా ప్లానింగ్ సెక్టోరల్ అధికారి తోట రాజు, జి.సి.డి.ఓ గౌసియా బేగం,  గెజిటెడ్ ప్రధానోపాధ్యయులు మల్లికార్జున్, శ్రీనివాస్ రావు, రమేష్ బాబు, ఉపాధ్యాయులు హశ్మతుల్లా , వసంత, సత్య, కల్పన, రామ్మూర్తి, జయపాల్ రెడ్డి, నవీన్, అనిల్, వెంకటేశ్వర్లు, కొండ శ్రీనివాస్ వ్యవహరించారు. వ్యాయమ విద్యా ఉపాధ్యాయులు గోర్ సింగ్, మనోజ్, కిరణ్, అశోక్, సంగీత, మాధురి కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు