Saturday, April 27, 2024

ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు.. కేవలం వెనుకబడ్డాం..

తప్పక చదవండి
  • అసెంబ్లీకి వెళ్లకపోయిన ప్రజలతోనే నా జీవితం
  • ఓడిపోయిన ప్రజలకు అందుబాటులోనే ఉంటా
  • ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
  • నన్ను ఆదరించిన సిర్పూర్‌ ప్రజలకు నా కృతజ్ఞతలు
  • బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వెల్లడి..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అసెంబ్లీ ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ తాను సిర్పూరులోనే ఉంటానని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనతో సహా బీఎస్పీ అభ్యర్థులందరూ ఓటమిపా లయిన నేపథ్యంలో సోమవారం ఆర్‌ఎస్‌ కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి నుంచి పాఠాలు నేర్చు కున్నామని ..ఒడి పోయామని కుంగిపోవడంలేదని .. ప్రజలకు దూరం కాబోమని.. రాబోయే రోజుల్లో ప్రజలకోసం, వారి సమస్య లపై అలుపెరగని పోరాటం చేస్తామని అన్నారు. ఇదే సందర్భంలో సిర్పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌ కు అభినందనలు తెలిపారు.
సిర్పూర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ దాడులు, రిగ్గింగ్‌ లు చేసి ఎన్ని ఆటంకాలు సృష్టించిన బీఎస్పీకి 44 వేల ఓట్లు వేసిన సిర్పూర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సిర్పూర్‌ ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. నాకు చెప్పండని అన్నారు . అందరికి అండగా ఉంటా. ఇంతకు ముందు ప్రారంభించిన హెల్ప్‌ లైన్‌ నంబర్‌ ఇకముందు కూడా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు . గెలిచి అసెంబ్లీలో ఉంటే సిర్పూర్‌ ని అభివృద్ధి చేస్తామని అనుకున్నాని .. . ఓడిపోయినా నేను సిర్పూర్‌ లోనే ఉంటూ ఇక్కడి ప్రజలకు అండగా ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తా’’ అని అన్నారు.
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ..
బీజేపీ పార్టీకి తాము పూర్తిగా వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, ఓటమి కాస్త బాధించిందని అన్నారు. అయితే తనకు 44 వేల ఓట్లు వచ్చాయని, అంత మంది తనకు మద్దతు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో పార్టీ కేవలం 1.37 శాతం ఓట్లకే పరిమితమవ్వడంపై స్పందిస్తూ.. తమ క్యాడర్‌ పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడం వల్లే బిఎస్పీ రాష్ట్రంలో గెలుపులో వెనుకబడిరదని అన్నారు.సిర్పూరులో గుండాగిరిని సాగనివ్వబోమని, ఎట్టి పరిస్థితుల్లో మతోన్మాదాన్ని సాగనివ్వమని అటు బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటై గెలుపొందారు. ఒక దొర వెళ్తే మరో దొరకు అవకాశం వచ్చిందని, దాన్ని అంతం చేయడమే తమ పంతమని అన్నారు. ప్రజలకు సేవ చేసే ఏ అవకాశాన్ని తాము వదులుకోమని, సిర్పూర్‌ లో కుటుంబ సమేతంగా ఉంటానని, హైదరాబాదుకు వెళ్లినప్పటికీ సిర్పూర్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు