Friday, July 26, 2024

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీ

తప్పక చదవండి
  • మోడీ, అమిత్‌షాల విధానాలు చేటు
  • బీజేపీది క్రిమినల్ గవర్నమెంట్‌
  • ఆదానీకి కట్టబెడుతున్న దేశ సంపద
  • సిపిఐ 99వ వార్షికోత్సవంలో లెఫ్ట్‌ నేతల మండిపాటు

హైదరాబాద్‌ ; దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌తో పాటు విచారణ సంస్థలను పెంపుడు కుక్కల్లా తయారు చేశారు. ఇండియా పేరు చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… బీజేపీ ప్రమాదకర సిద్దాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంభోత్సవానికి రావొద్దని చెప్పారు. బీజేపీ మోస్ట్‌ క్రిమినల్‌ గవర్నమెంట్‌. క్రిమినల్‌ గ్యాంగ్‌, మోదీ, అమిత్‌ షా, క్రిమినల్‌ గ్యాంగ్‌ దేశాన్ని పరిపాలిస్తోంది. దేశ సంపదను ఆదానీ చేతికి అప్పగించారు. లెప్ట్‌ వింగ్‌ ప్రమాదకరమని చెబుతున్నారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరనీగా తయారుచేస్తున్నారు. దేశానికి రైట్‌ వింగ్‌ ప్రమాదకరమా..? లెప్ట్‌ వింగ్‌ ప్రమాదకరమా అనేది తెల్సుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ తెలిపారు. విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయ మయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంట్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎట్లా ఇచ్చారు..? పాసులిచ్చిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్‌ చేశారు. పై స్థాయిలో బిల్లులను అమోదించు కోవడానికి పార్లమెంట్‌పై దాడికి ఎª`లాన్‌ చేసుకున్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మోదీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చెందుకు ప్రయత్నం చేస్తున్నారు.. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తింపు ఉంటుందని నారాయణ పేర్కొన్నారు. 1917కు ముందు విశ్వంలో ఒకే గ్లోబ్‌ ఉండేది. 1917 సోవియట్‌ విప్లవం వచ్చిన తర్వాత విశ్వంలో ఒక ఎర్ర చుక్క పొడిచింది. సోవియట్‌ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు. బ్రిటిష్‌ దొరలను తరమాలని అనుకున్నారు తప్ప ఎలాంటి స్వాతంత్యర్ర కావాలని ఎవరు అనుకోలేదు. దేశంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆవిర్భవించిన తర్వాతే స్పష్టమైన స్వాతంత్య రాజ్యాంగ దేశం ఏర్పడిరది. వారసత్వ ఉద్యమం స్ఫూర్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. దేశ స్వాతంత్యల్రో కమ్యూనిస్ట్‌ పార్టీ వేలాదిమంది అమరవీరులను పోగొట్టుకుంది. స్వాతంత్య పోరాటంలో బీజేపీ పార్టీ పాత్ర లేదు. కులాలు, మతాల పేరు విూద దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు దేశం విచ్ఛిన్ననీ చేసేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో పాలక గణాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. దేశం ఐక్యంగా ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వంలా దేశం బలంగా ఉండాలి. దున్నే వాడికి భూమి కావాలనే ఉద్యమం నుంచి సాయుధ పోరాటంతో వరకు దేశంలో కమ్యూనిస్ట్‌ పార్టీ అనేక నిర్భాందాలను ఎదుర్కొన్నదని నారాయణ తెలిపారు. విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ 99వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో ప్రకటించుకున్న రోజు అనేక బలిదానాలను, అనేక త్యాగాలను ఎదుర్కొని 99 ఏళ్లుగా ముందుకు నడుస్తున్నానీ. 1849 కార్ల్‌మార్క్స్‌ కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో రూపొందించారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. రష్యా విప్లవం ప్రపంచానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది. బలం ఉన్నోడిదే రాజ్యం కాదు.. శ్రమ పడ్డోడిదే రాజ్యమని కార్ల్‌మార్క్స్‌ నూతన మార్గాన్ని సూచించారు. ఆ పునాదుల విూదే భారతంలో సీపీఐ ఉద్భవించింది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఉద్భవించిన తర్వాతే అనేక చట్టాలు, సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. దేశంలో ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. కోట్లాది మంది పేదరికంతో దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారు. పాలకుల ప్యారవిూటర్స్‌ పేపర్ల వరకే పరిమితమవుతున్నాయి. ఎర్రజెండా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేని తెలంగాణలో గెలిచాను. రోజుకొక పార్టీ మారే హీనులు కమ్యూనిస్టుల పార్టీలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. 99 ఏళ్లలోకి అడుగు పెట్టాం. ఏడాది పాటు కమ్యూనిస్ట్‌ ఉత్సవాలు జరుకుంటామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు