Monday, May 6, 2024

మతిభ్రమించి మాట్లాడుతున్న తుమ్మల

తప్పక చదవండి
  • నీకు వేస్తే మంచి ఓటు లేదంటే దొంగ ఓటా
  • ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం : నీకు ఓటు వేసినోడికి ఖమ్మంలో ఓటు ఉండాలా వేరే వాడికి ఓటు ఉండొద్దాని ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరం 12, 13వ డివిజన్‌ శ్రీనగర్‌కాలనీ నందు రాయలశేషగిరిరావు, జక్కంపూడి వీరభద్రం, నలజాల రవి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నీకు ఓటు వేసే అది మంచి ఓటు వేయ్యకుంటే అది దొంగ ఓటా అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మలపై ఫైర్‌ అయ్యారు. భారతరాజ్యాంగప్రకారం 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఓటు హక్కును తమకు అనుకూలమైన చోట వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉందన్నారు.మాకు మమత మెడికల్‌ కళాశాల ఉన్నందున కొత్తగా చేరిన విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన వారు తొలిసారి ఓటు వచ్చిన వారు ఇక్కడ హాస్టల్లో ఐదేళ్లు ఉంటారు కాబట్టి వారి ఇష్టప్రకారం వారు ఇక్కడ ఓటును నమోదు చేసుకున్నారన్నారు.అదివారి వ్యక్తిగత ఇష్టమని, కావాలి అనుకుంటే ఇక్కడే నమోదు చేసుకుంటారు వద్దనుకుంటే నమోఉదు చేసుకోరు అని స్పష్టంచేశారు.దీన్ని సాకుగా చూపి మమత ఆసుపత్రిఆలో 3వేల ఓట్లు ఉన్నాయని అవివేకంగ సిగ్గులేకుండా మాట్లాడటం సరైందికాదన్నారు.ఓటమి నీళ్ల ఎదుట కనిపించే సరికి ఫ్రస్టేషన్‌ను తట్టుకోలేక నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నావని ధ్వజమెత్తారు. నీకు 40ఏళ్లు అనుభవం ఉంది అంటూ చెప్పుకుంటున్న నువ్వు దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుమాలిన పని అని విమర్శించారు. నీ అనుభవంతో ప్రజలను ఓప్పించుకో, మెప్పించుకో ఓట్లు వేయించుకో గెలవలేము అని తెలిసి ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేసి నీస్థాయిని నువ్వే దిగజార్చుకుంటున్నావన్నారు. బట్టకాల్చి మొహం మీద వేస్తా బురద జల్లుత కడుక్కో అంటే సరిపోదు వీటన్నింటికీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. నామీద నిందలు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి నీకు ఓట్లు వేస్తారని భ్రమపడుతున్నావు ఇవన్నీ ప్రజలు నమ్మరని వారికి అన్ని తెలుసన్నారు. నేను ఇక్కడి బిడ్డను ఇక్కడే ఉన్న ప్రజలతో ఉన్న అజయ్‌ అంటే ఎంటో వాళ్లకి తెలుసని, నన్ను కడుపులోపెట్టుకొని సాదు కుంటారన్నారు.నువ్వుచేప్పే మాటలు, ఆరోపణలు వారు నమ్మకపోగా నిన్ను చిత్తుగా ఓడిరచడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛ్కెర్మన్‌ కూరాకుల నాగభూషణం, కార్పోరేటర్‌లు కొత్తపల్లి నీరజ, చిరమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, మారగాని సుదర్శన్‌, రామారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు