Friday, May 17, 2024

ఈ లైట్లు వెలిగేదెన్నడు..

తప్పక చదవండి
  • పంచాయతీ పాలకవర్గానికి సంబంధం ఉన్నట్టా లేనట్లా..?

కొల్చారం : మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గల విభాగిని మీద ఏర్పాటు చేసిన ఫ్లడ్లైట్లు సుమారు రెండు నెలలుగా వెలగటం లేదు. అసలే శీతాకాలం, సాయంత్రం ఐదు దాటిందంటే చీకట్లు నిండుగా కమ్ముకుంటుండడంతో పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద నివసించే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం సమయంలో నిత్య అవసరాల కొరకు బయటకు వచ్చిన ప్రజలు రోడ్డు దాటాలంటే వనికి పోతున్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దీనికి తోడు వరి పంటలు చేతుకొచ్చిన తరుణంలో రైతులు తమ వరి ధాన్యాన్ని రోడ్డుపైనే ఆరబోయడం, రోడ్డుకిరువైపులా కుప్పలు చేసి ఉండడంతో ఎక్కడ వరుకుప్పలు ఉన్నాయో ఎక్కడ మనుషులు ఉన్నారో అని వాహనదారులకు చీకట్లో కనిపెట్టలేని పరిస్థితి ఎదురైంది. దీంతో దారి పొడవునా ఎక్కడ ఏ ఆపద ముంచుకొస్తుందోనని అక్కడ ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇంత జరుగుతున్న పంచాయతీ పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు . ఎన్నికల ప్రచారం అంటూ పలు పార్టీలకు చెందిన నాయకుడు ఊర్లలో తిరుగుతున్న లైట్లు వెలగడం లేని స్థితి వారి కంటికి కనిపించలేదా అని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లైట్లు వెలిగేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు