Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదాలకు ఇంజనీరింగ్‌ లోపమే కారణం..!

తప్పక చదవండి
  • కేంద్రమంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు..!

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : భారత్‌లో ప్రతి ఏటా ఐదులక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, తరుచుగా జరిగే ప్రమాదాలకు ఇంజనీరింగ్‌ లోపమే కారణమని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేం దుకు బ్లాక్‌ స్పాట్స్‌ను తొలగించేందుకు ఇంజనీర్లు కృషి చేయాలని ఆయన
సూచించారు. ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ 82వ వార్షిక సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నిర్మాణ వ్యవయాన్ని తగ్గించుకోవాలని.. ప్రత్యామ్నాయాలను వినియోగిస్తూ అత్యా ధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించి నాణ్యతలో రాజీపడకుండా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ‘దేశంలో ఏటా 5లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. 1.5లక్షల మంది మర ణిస్తు న్నారు.3లక్షల మంది గాయపడుతున్నారు. దీంతో దేశ జీడీపీకి 3శాతం నష్టం వాటిల్లుతోంది. అయి తే, ప్రతి ప్రమాదానికే డ్రైవర్‌నే నిందిస్తారు. బలిపశువులా చేస్తారు’ అన్నారు. ప్రమాదాలకు రోడ్‌ ఇంజి నీరింగే కారణమని.. రోడ్లు నిర్మించే సమయంలో ప్రమాదాల నివారణకు తగిన సరైన ఇంజినీ రింగ్‌ ఉండాలన్నారు. ‘నాకు కూడా ప్రమాదం జరిగి నాలుగు ఎముకలు విరిగిపోయాయి. చాలా మంది చని పోతున్నారు. 18-34 ఏళ్ల మధ్య వయస్కులే 60శాతం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇం దులో చాలామంది ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు. ఇది మంచిదేనా?’ అంటూ ప్రశ్నించారు. డిజైన్‌, నాణ్యత విషయంలో రాజీపడకుండా డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ (డీపీఆర్‌)లో నైపుణ్యం అవసరమని నొక్కి చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు