Monday, April 29, 2024

దేవరకొండలో సప్పగా సాగిన కేటీఆర్‌ రోడ్‌ షో

తప్పక చదవండి
  • చిన్నపాటి చినుకులకే పీలగా సాగిన కేటీఆర్‌ ప్రచారం
  • దేవరకొండ అంటే బర్లు గొర్లేనా అభివృద్ధి మాట ఎక్కడ
  • రోడ్‌ షోకి వచ్చిన జనాలకు డబ్బు మద్యం ఫుల్‌

దేవరకొండ : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి సీఎం తర్వాత సీఎం కేటీఆర్‌ వస్తున్నాడని దేవరకొండ బాగు పడే హామీలు ఇస్తాడని ఆశపెట్టు కున్న ప్రజానీకానికి అడియా శగా మారిం దని అంటున్న దేవం కొండ ప్రజా నీకం. దేవరకొండ నియోజ కవర్గం పలు మండ లాలకు గ్రామా లకు ఎంతో దూ రం ఉన్న వాటి గురించి మెరు పైన మాట్లాడ కుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో ఎక్కడైతే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుగాలి ఎక్కువగా వీస్తున్న ప్రాంతాలకు కేటీఆర్‌ సుడిగాలి పర్యటనలో భాగంగా రోడ్‌ షో కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది. కేటీఆర్‌ మాట్లాడుతూ. రాబోయేది మళ్లీ కెసిఆర్‌ ప్రభుత్వమే మూడోసారి రవీంద్ర కుమార్‌ ను గెలిపించి మీ దేవరకొండను అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వివరిస్తూ.మహిళలకు రాబోయే రోజుల్లో సువర్ణ అవకాశం కల్పిస్తామని చెప్పసాగారు.దేవరకొండ పట్టణం పరిధిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రోడ్‌ కేటీఆర్‌ రోడ్‌ షో ఏర్పాటు ఘనంగా నిర్వహించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అనుకున్నంత జన సమీకరణ చేయకపోవడంతో దానికి తోడు పకృతి కూడా సహకరించలేదని చెప్పాలి.రోడ్‌ షో వచ్చిన ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వేళ చిన్నపాటి ముసురు మొదలు కావడంతో వచ్చిన జనాలు కూడా ఎక్కడికి అక్కడే ఉండిపోవడంతో కేటీఆర్‌ వచ్చే సమయానికి అతి కొద్దిపాటి జన సమీకరణ కూడడంతో చేసేదేమీ లేక ఒప్పుకున్న పెళ్లికి బ్యాండ్‌ మేళం మోగించక తప్పదు అన్నట్టు ఏర్పాటు చేసిన రోడ్‌ షోకి కేటీఆర్‌ దేవరకొండ నియోజకవర్గం పై వివరాలు కురిపించకపోవడం ఒక ఎత్తు అయితే బర్లు,గోర్లు,ధూప,దీప నైవేద్యం హామీలతో నామమాత్రపు హామీలతో తిరుగు ముఖం ప్రయాణం పట్టడని చెప్పాలి. కేటీఆర్‌ రోడ్‌ షో అనంతరం మార్కెట్‌ యార్డులో ఆయా గ్రామాల నాయకులు ప్రజలకు డబ్బులు పంచుతూ.మద్యం తీసుకోవాలని చెబుతూ ఇంకెవరైనా మిగిలితే వారి కూడా డబ్బులు పంచుతామని చెప్పుకోవడం జరిగింది.ఈతతంగం అంత చూస్తున్న జనాలు ఇలా చెవులు కొరుకుతూ. దేవరకొండ నియోజకవర్గం పరిధిలో టిఆర్‌ఎస్‌ పార్టీకి సరిపడంత జనబలం లేకపోవడంతోటే డబ్బులు ఇచ్చి మద్యం పోసి జనాలను తీసుకువస్తున్నారని,దానికి ఉదాహరణ డబ్బులు పంపకమని అనుకోవడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు