Wednesday, May 15, 2024

కేసీఆర్‌ చిల్లర రాజకీయాలు చేస్తుండు….

తప్పక చదవండి
  • ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్లు గల్లంతు…
  • తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముతున్న కేసీఆర్‌..
  • బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఐటీ రద్దు చేస్తాం..
  • ఆడబిడ్డ సంధ్యారాణిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
  • మాజీ మంత్రి.. హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌…

గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ప్రజా సంకల్ప సభకు ఆయన హాజరయ్యారు. మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఈటెల రాజేందర్‌కు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి తన అనుచరులు కార్యకర్తలు నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం బైకు ర్యాలీగా సభ సలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… రామగుండం నియోజకవర్గంలో ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే సంధ్యారాణి గెలుస్తుందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉన్న సంధ్యారాణిని గెలిపించుకొని ఇక్కడ సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు సంబంధించిన ఐటీని రద్దు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అమ్ముతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని, బీఆర్‌ఎస్‌ పార్టీ మూడో స్థానంలోకి పడిపోతుందని విమర్శించారు. అలాగే సింగరేణి కాంట్రాక్టు కార్మికులతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పై పవర్‌ కమిటీ వేతనాలతో పాటు కనీస సౌకర్యాలను కల్పిస్తామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి ధాన్యానికి క్వింటల్‌ కు 3100 రూపాయలు ఇప్పిస్తామన్నారు. అలాగే బీసీ బిడ్డను సీఎం చేస్తానని ర్యాలీ నరేంద్ర మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలను పక్కనపెట్టి మద్యం, డబ్బులను, పోలీసులను, అధికారాన్ని నమ్ముకున్నాడని విమర్శించారు.రామగుండం నియోజకవర్గంలో ఆడబిడ్డ సంధ్యారాణిని పిలిపిస్తే తను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.నవంబర్‌ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి సంధ్యారాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రావుల రమానాత్‌, వడ్డేపల్లి రామచందర్‌, బల్మూరు వనిత, హిమానాధ్‌ గౌడ్‌, కోమళ్ళ మహేష్‌, మామిడి రాజేష్‌, మాతంగి రేణుక, గండ్ల ధర్మపురి, బోడగుంట జనార్ధన్‌, పెద్దపల్లి రవీందర్‌, సులువ లక్ష్మీ నరసయ్య, క్యాతం వెంకటరమణ, జక్కుల నరహరి, స్వరూప, యాదగిరి, సత్తయ్య, కొమ్ము శ్రీను, గోపనోని నవీన్‌ గౌడ్‌, మాధవ్‌, మూల హరీష్‌, పిల్లి శివయ్య, లక్ష్మణ్‌ యాదవ్‌, దాసరి ఓదెలు, చంద్రశేఖర్‌, కొమ్ము గట్టయ్య, లింగం నాయక్‌, రాజేష్‌, నాయక్‌, రమేష్‌, సతీష్‌ కుమార్‌, సంపత్‌, రాజేష్‌, నరసయ్య, సాగర్‌, విజయ్‌, సురేష్‌, మల్లేష్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు