- నవంబర్ 30న వార్ వన్ సైడ్ కావాలె..
- వికారాబాద్ గడ్డపై నీలి జెండా ఎగరాలే.. మిగితా పార్టీలన్నీ పారిపోవాలే
- ఒక్కసారి బీఎస్పీనీ గెలిపించుకోండి… దొంగల భరతం పడదాం
- వికారాబాద్ రోడ్ షోలో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
వికారాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తాం… ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీఎస్పీ పార్టీ రాజ్యాధికార సభ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.ఈ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ… వికారాబాద్ గడ్డపై ఎందరినో గెలిపిం చారు. కానీ వికారాబాద్ అభివృద్ధి ఎందుకు నోచుకోలేదో ప్రజలు ఆలోచించాలి అన్నారు. రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి చేరడానికి స్థానిక పాలకుల చేత కానీ తనం కాదా..? నిజంగా ఈ ప్రాంతం మీద వారికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసేవారు కదా. ఇక పోతే పదేండ్లు పాలించిన కేసీఆర్ సర్కార్ ఉద్యోగులు, పోలీసులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రాజ్యంలో జీతాలు రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. నవంబరు 30వ తేదీన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బీజేపీ పార్టీల గువ్వ గుయ్యమనే విధంగా బీఎస్పీకి ఓట్లు వేయాలి. బీర్లు క్వార్టర్లు మా పేదలకు డబ్బులు పదవులు మీకా.. ..? అని ప్రశ్నించారు. మీరు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు కోటీశ్వరులు ఎలా అవుతున్నారు.కోళ్ల పరిశ్రమలు వాళ్ళకే వస్తున్నాయి.కానీ పేదవాళ్లకు ఎందుకు రావడం లేదు అన్న విషయం ప్రజలు ఆలోచించాలన్నారు.అన్ని కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే నన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి ఓస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం అని బరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్,కాంగ్రెస్ నాయకులను నమ్మకండి.మీ చేత ఓట్లు వేయించుకొని గెలిచాక వాళ్లకు నచ్చిన పార్టీలో చేరి కోట్లు దండుకుంటారు అని ఆరోపించారు. కేసీఆర్ ఈ ఎన్నికల్లో గద్దె దించాలి. చిరు ఉద్యోగులు,కార్మికులు,కూలీలు ఇచ్చిన విరాళా లతో హెలికాప్టర్‌తో వస్తున్నాను అని సగర్వంగా చెప్పారు. రేపటి రోజున బహుజనులే హెలిక్యాప్టర్లకు ఓనర్లు అవుతారు’’ అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.వికారాబాద్ లో క్రాంతి కుమార్ ఎదుగుతున్నడని తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారు. ఇలాంటి కుట్రలు పన్నే బిఆర్‌ఎస్ దొంగనా కొడుకులకు ఈ ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి.ఈ సారి ఎన్నిక మన తలరా తలు మార్చే ఎన్నిక.ఈ ఎన్నిక కొండ చిలువలకు చలి చీమలకు మధ్య జరిగే ఎన్నిక.కావున ఈ ఎన్నికల్లో చలి చీమలు గెలువాలి. గెలువాలంటే 90 శాతమున్న బహుజనులు వన్ సైడ్ ఏనుగు గుర్తుపై ఓటేసి బీఎస్పీ అభ్యర్తులను గెలిపించాలి అని కోరారు. ఈ రోడ్ షోలో బీఎస్పీ పార్టీ ముఖ్య నాయకులు, వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. క్రాంతి కుమార్, పరిగి కొడంగల్ అభ్యర్థులు, జిల్లా ఇన్చార్జి అరుణ్, బిఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.