Sunday, May 5, 2024

చంద్రుడికి మబ్బులు..

తప్పక చదవండి
  • ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించని కేసీఆర్‌
  • కేటీఆర్‌ అమెరికా వెళ్ళడం ఖాయం
  • తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఖాయం
  • అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే చెప్పాయి
  • 3న ఫలితాల్లో గెలుపు మాదే
  • కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తున్నాం
  • మీడియాతో రేవంత్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు ఇదే విషయం వెల్లడిరచాయని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. గురువారం ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామన్నారు. ఇన్నాళ్లూ అధికారమే శాశ్వతమని కేసీఆర్‌ నమ్మారని, తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్‌ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారని, అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఎన్నికల ఫలితాలకు ఓ లింక్‌ ఉందని చెప్పారు. నేడు తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ పూర్తైంది.. ఎక్కువ శాతం ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెట్టాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ రబ్బిస్‌ అని కేటీఆర్‌ పేర్కొన్న వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. అవి నిజమైతే కేటీఆర్‌ క్షమాపణలు చెబుతారా? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ అహంకారంపై ప్రజలు తిరుగుబాటు చేసారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక ప్రజాస్వామ్య యుతంగా పాలన చేస్తుందని, అన్ని వర్గాలను దరికి చేరుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం నెలకొల్పుతామని అన్నారు. ‘ఓటమి ఖాయమని తెలిసినప్పుడల్లా నియోజకవర్గం మార్చారు కేసీఆర్‌. గజ్వేల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ ఇలా స్థానాలు మారస్తూ కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌ను ఇక్కడ దొరకబట్టి ఓడిరచారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఆనందంగా ఉంది’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. దిగిపోయే ముందు కేసీఆర్‌ మీడియా ముందుకు కూడా రాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని మెచ్చుకున్నారు. తాము పాలకులుగా ఉండబోమని, సేవకులుగా ఉంటామని రేవంత్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌ కూడా త్వరలో అమెరికా వెళ్తారని రేవంత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫలితాలపై కేసీఆర్‌ మాట్లాడలేదు.. చంద్రుడికి మబ్బులు పట్టాయి.. కబడకుండా పోయారు అంటూ రేవంత్‌ ఎద్దేవా చేశారు. ప్రజలను జంతువుల మాదిరి ట్రీట్‌ చేశారు.. కాంగ్రెస్‌ శ్రేణులు ఈరోజు నుంచి విజయ సంబరాలు బాధ్యతగా ఉందా. గెలుపు ఓటములు సహజం.. ఓడినవాడు బానిసకాడని రేవంత్‌ అన్నారు. ప్రతిపక్షాలనుసైతం కాంగ్రెస్‌ గౌరవిస్తుందని రేవంత్‌ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, అన్ని వర్గాలు ప్రభుత్వం మాది అన్న విశ్వాసం కల్పిస్తామని చెప్పారు. ఎవరిమీద కాంగ్రెస్‌ ఆధిపత్యం చెలాయించే పనిచేయదని, మేం పాలకులం కాదు.. సేవకులంలా పనిచేస్తామని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు. అధిష్ఠానం సూచన మేరకు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు.
ఇదిలావుంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘నల్గొండలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. ఎర్రబెల్లి ఓటమి ఖాయం. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కుదిరింది. కార్యకర్తల పోరాటం వృథా కాలేదు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్‌ లాంటి వారే ఓడారు. కేసీఆర్‌ ఓ లెక్కా. కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోబోతున్నారు. కాంగ్రెస్‌ మార్క్‌ పాలన చూపిస్తాం.’ అని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు